కొమరిక

  

నీవు ఇంద్ర చాపమని
నీవు వెన్నెల తాపమని 
 
నీవు హంస ధ్వనివని
నీవు మేఘపు ఝరివని
 
నీవు నడకల నెమిలివని
నీవు కులుకుల కొమరికవని
 
నీవు మేని మెరుపువని
నీవు వలపుల జల్లువని
 
నీవు విరి చూపుల  కలువనివని
నీవు ఎద పొంగుల మధువనివని
 
సంధ్యా వర్ణ పొద్దుల్లో
సప్తస్వర కీర్తనలా
పరువపు  అంచులలో
పులకించే అవనిలా
ఉన్న నినుచూస్తూ
ప్రేమ తుఫాను సడిలో మునిగిపోతున్నా...!
 
రచన
డా!! బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722