యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి- కరస్పాండెంట్ కోట రఘునాథరెడ్డి


తొర్రూర్ మహబూబాబాద్ ఫిబ్రవరి 10(జనం సాక్షి)

యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సమతా విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటా రఘునాథ రెడ్డి పేర్కొన్నారు .నేడు  సమతా డిగ్రీ  పీజీ కళాశాలలో కళాశాలలో ఐసిఐసిఐ, డిసిసి,టాటా,మహేష్ బ్యాంకులు నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పట్టుదల అంకితభావం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన సూచించారు.కాగా ఈ జాబ్ మేళాలో తొర్రూర్ పట్టణానికి చెందిన పరిసర గ్రామాల నుండి సుమారు200 మంది యువత పాల్గొనగా, వారికి మూడు దశలలో ఇంటర్వ్యూ నిర్వహించి తుది పరీక్షకు 40 మంది  నీ ఎంపిక చేసినట్లు జాబ్ మేళా నిర్వాహక  బ్యాంకులు తెలియజేశాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకన్న, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.