" శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో అగ్రతాంబూలం - ప్రభుత్వ విప్ అరికెపూడిగాంధీ"


శేరిలింగంప‌ల్లి, ఫిబ్రవరి 21( జనంసాక్షి) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే అభివృద్ధి పనులలో భాగంగా నియోజకవర్గానికి అగ్రతాంబూలం అందిస్తానని, ప్రజాదరణ, ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడుతూ  ప్రజలలో టిఆర్ఎస్ పార్టీపట్ల ఉన్న నమ్మకాన్ని మరింత ఇనుమడింప జేయడానికై తాను అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్  స్పష్టంచేశారు. ఈ మేరకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధి ఈర్ల చెరువు వద్దనుండి దీప్తిశ్రీ నగర్ నాలావరకు15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన నాలా విస్తరణ పనులకు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రియాంక అల, కార్పొరేటర్లు వి. పూజితాగౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి సోమవారం శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీఉండబోదని, ప్రతి పనిని శాశ్వత ప్రాతిపదికన దశలవారీ కార్యాచరణతో పూర్తి చేయడం జరుగుతుందని గాంధీ అన్నారు.  హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి  దీప్తిశ్రీ నగర్ వరకుగల నాలానుండి జాతీయ రహదారి వెంబడి NH 65 వరకు 15.88 కోట్ల రూపాయల  అంచనావ్యయంతో  2.4 కి. మీల మేర చేపడుతున్న నాలా విస్తరణపనులపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్నామని, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కారణంగా నాలా విస్తరణ పనులను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో కూడిన పద్ధతిలో పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఇది GHMC, జలమండలి , ఇరిగేషన్ విభాగాల సహకారం, సమన్వయంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని, ఎలాంటి అవకతవకలు, అలసత్వానికి తావు ఉండబోదని ఆయన ధీమాను వ్యక్తంచేశారు. మరికొద్ది నెలల్లో రాబోయే వర్షకాలాన్ని దృష్టిలోపెట్టుకొని నియోజకవర్గంలోని అన్నిప్రాంతాలలో ఉన్న  నాలాల సమాచారం సేకరించి అవసరాలకనుగుణంగా విస్తరణ పనులను చేపట్టి వేగవంతం చేయడానికి అధికారులతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తామని అరికెపూడి స్పష్టంచేశారు.  నాలాల విస్తరణపై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గాంధీ పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్కపరిస్ధితుల్లోసైతం  అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే  ఉదేశ్యంతో ప్రభుత్వం రాజీలేకుండా అభివృద్ధిపనులను చేపట్టడం జరుగుతుందన్నారు. నాలా విస్తరణపనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, ప్రజావసరాల దృష్ట్యా  నాలావిస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. పనులలో నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతాయుతంగా మసలుకోవాలని, గత అనుభవాలను  దృష్టిలోపెట్టుకొని లోతట్టుప్రాంతలు, నీరు నిల్వవుండే ప్రాంతాలనుగుర్తించి ప్రజలకు ఇబ్బందికల్గకుండా చూడాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 
ఈకార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీకాంతిని, DE విశాలాక్షి , AE ప్రతాప్ ,ఇరిగేషన్ DE నళిని, AE శేషగిరిరావు మరియు హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బలింగ్ గౌతమ్ గౌడ్,చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు,నాయకులు లక్ష్మ రెడ్డి,కిషన్ రావు,రవీందర్ రెడ్డి,యాదగిరి ముదిరాజ్,ప్రవీణ్ గౌడ్,జామీర్,సుబ్బు,ఉమామహేశ్వరరావు,విష్ణు,విజయ్ కుమార్,నాగేశ్వర్ రావు,రవి చందర్,మోహన్,వీరాజు,శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,ఎస్.సి సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్,శ్రీనివాస్ గౌడ్,వెంకట్ రెడ్డి,సాయి యాదవ్,దేవేందర్,సుధాకర్,కృష్ణ,అంబేద్కర్,దామోదర్ రెడ్డి,వెంకటేశ్వర రావు,వేణు గోపాల్,సుదర్శన్ రాజు,ముజీబ్ తదితరులు పాల్గొన్నారు..