దళితబంధు అర్హులకే ఇవ్వాలి


ఇబ్రహీంపట్నం ,ఫిబ్రవరి 08 ,(జనం సాక్షి ) అర్హత ఉన్న వారికే దళిత బంధు ఇవ్వాలని ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ గ్రామానికి చెందిన హరిజన సంఘ సభ్యులు ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా హరిజన సంఘ సభ్యులు మాట్లాడుతూ గోధూరు గ్రామంలో  దాదాపు 200 దళిత కుటుంబాలు ఉన్నాయని , దళిత బందు విషయంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి , అర్హతలు ఉన్న వారికే ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు , సంఘ సభ్యులు పాల్గొన్నారు.