మన ఊరు`మన బడికి 2 లక్షల విరాళం

సంగారెడ్డి,మార్చి4 ( జనంసాక్షి ) :  ’మన ఊరు`మన బడి’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం రూ.2 లక్షల చెక్కును సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావుకు అందజేశారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన మన ఊరు`మన బడి కార్యక్రమంతో పాఠశాలల దశ మారుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంగారెడ్డి జిల్లాలోని బడుల్లో ఆంగ్ల విద్యా బోధన ప్రారంభం కానున్నట్లు చెప్పారు.