all 1st page news

 


1.అహంకారానికి తప్పదు పరాభవం
ఇది చరిత్రలో జరిగిన సత్యం
అవహేళన కేంద్రానికి నూకలు చెల్లినట్లే
వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే తడాఖా చూపుతాం
ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం
ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా తెలంగాణకు అవమానాలు
నూకలు తినమంటూ పీయూష్‌ గోయల్‌ వెక్కిరింపు వ్యవహారాలు
తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం
విూడియా సమావేశంలో మంత్రులు వెల్లడి
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):ధాన్యంసేకరణలో కేంద్రం సానుకూల నిర్ణయం తసీఉకోకుంటే ఉగగాది తరవాత కేంద్రానికి చేదు అనుభవమేమిటో రుచి చూపిస్తామని తెలంగాణ మంత్రులు ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ధాన్యాన్ని కొనాల్సిందేనని, ఇందులో ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌,వేముల ప్రశాంతరెడ్డి,పువ్వాడ అజయ్‌ కుమార్‌లు ప్రకటించారు. పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం వీరు విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వడ్లు కొనాలని ఎన్నిసార్లు విన్నవించనా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని, రా రైస్‌ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతోందన్నారు. తెలంగాణలో పండిన యాసంగి వడ్లు రా రైస్‌ కి పనిరావని, బాయిల్‌ చేయకుంటే నూకలు అవుతాయని చెబితే కేంద్రం వినడంలేదన్నారు. కావాలంటే విూ ప్రజలకు అవే నూకలు అలవాటు చేయాలని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందన్నారు. తెలంగాణ అంటే ఎందుకంత చిన్నచూపు అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని అవమానించిన వాళ్ళు చరిత్ర పుటల్లో కలిసిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానించిన వారు రాజకీయంగా జాడ లేంకుండా పోయారన్నారు. గతంలో రూపాయి కూడా ఇవ్వలేదన్న మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడడ్‌ఇ ఏమయ్యోడో గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్రం ఇంత ఘోరంగా అవమానిస్తుంటే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ విూద, కేసీఆర్‌ విూద విషం గక్కుతున్నారని ఆరోపించారు. రైతుల గురించి కేంద్రం ఏమాత్రం ఆలోచించడంలేదని, తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్రానికి ముందు చూపులేదని, పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కేంద్రం స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని, అందుకు రైతులు సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే కెసిఆర్‌ రైతులకు రోణ కవచంగా ఉంటారని వారు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. మంత్రి కిషన్‌ రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కేసీఆరే రైతులకు రక్షణ కవచం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేక పోయానని తెలిపారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్‌ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో కప్పివేయబడ్డారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్టాన్రికి ఎటువంటి సహకారం లేదన్నారు. దశాబ్దాల పెండిరగ్‌ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని గుర్తించి, ఈ రంగం విూద దృష్టి సారించారని తెలిపారు. దేశంలో పండిరచిన వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదే అని నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా లేకి మాటలు మాట్లాడుతున్నారు. హుందాతనం ప్రదర్శించట్లేదు. చచ్చేవరకు కేంద్ర మంత్రి పదవిలోనే ఉంటావా? అని కిషన్‌ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నీ ఆత్మ చెప్పట్లేదా? తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వడ్లు తీసుకోవాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదు. మా వినతిపత్రాలను కనీసం చదవకుండా.. తెలంగాణపై విషం కక్కుతారు. యజమాని బానిసతో మాట్లాడినట్లు కేంద్రం వ్యవహారం ఉందన్నారు. యూపీఎ హయాంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు కేంద్రం మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు.. రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇథనాల్‌ తయారీ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు.. గతంలో విూరే దానికి జై కొట్టారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలైన భరిస్తాం.. కానీ సమయం వచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది.. ఇంత పెద్ద భారతదేశంలో రాష్టాల్రతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని మంత్రి తెలిపారు. కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్‌ ప్రొడక్షన్‌ 2025 నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు. గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం... ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెం దుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని’ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు పీయూష్‌ గోయల్‌ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కిషన్‌ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి.. ఒక్కసారైనా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. ’కేంద్రం కావాలనే తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తోంది. మెడవిూద కత్తి పెడితే రైతుల ప్రయోజనాల కోసం.. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని రాసిచ్చాం. కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాలని 16సార్లు లెటర్లు రాశాం. నెలకు 10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రానికి పంపగలం.. తీసుకెళ్లమంటే మా దగ్గర ర్యాకులు లేవని వాళ్లే అన్నారు. పైగా సమయానికి సప్లై చేయడం లేదని అభాండాలు వేస్తున్నారు. మేం చేసిన
ప్రయత్నాలన్నీ కిషన్‌ రెడ్డికి తెలిసేలా లెటర్లు పంపిస్తాం. వాటిని చూసి అయినా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నాం’ అని మంత్రి గంగుల అన్నారు. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్‌ రెండు వరకు కేంద్రం స్పందన కోసం చూస్తామని... ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నా రన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

 

2.తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట
` లైఫ్‌సైన్సెస్‌ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌
` టాప్‌ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ చర్చలు
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి): తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రికెటిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు వెల్లడిరచారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్‌ అమెరికాలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే టాప్‌ ఫార్మా కంపెనీలైన ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జేఅండ్‌జే), జీఎస్‌కే అధిపతులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. మొదట ఫైజర్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, చైర్మన్‌ డాక్టర్‌ ఆల్బర్ట్‌ బౌర్లా, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ గ్లోబల్‌ సప్లై ఆఫీసర్‌ మైక్‌ మెక్‌డెర్మాట్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌రంగం పురోగతిని వివరించారు. అలాగే, ఇండియాలో హెల్త్‌కేర్‌, ఫార్యాస్యూటికల్‌ రంగానికి సంబంధించి ఫైజర్‌ కంపెనీ వ్యూహాలు, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫైజర్‌ కంపెనీ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉవే స్కోన్‌బెక్‌తో కూడా సమావేశమయ్యారు. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో హైదరాబాద్‌ ఎకోసిస్టంను తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మథాయ్‌ మామెన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మరో అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌ª`లకైన్‌ (జీఎస్‌కే) చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఆగం ఉపాధ్యాయ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సామర్థ్యాలను వివరించారు. మంత్రి వారితో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించిన తన విజన్‌ని పంచుకున్నారు. హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్‌ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో సహాయపడే సాధ్యమైన మార్గాలు, కార్యక్రమాలపై సూచనలను కోరారు. ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ ప్రజెంటేషన్‌తోపాటు ఇన్నోవేషన్‌పై దృష్టి సారించి లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫార్మా కంపెనీల అధిపతులు మెచ్చుకున్నారు. ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శ్రీ శక్తి ఎం. నాగప్పన్‌ పాల్గొన్నారు.

 

3.పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన
` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట
న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్‌ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకూ ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించనుంది. తొలి దశ పోరులో మార్చి 31ను గ్యాస్‌ సిలిండర్‌ షహీది దివస్‌గా పాటించాలని నిర్ణయించింది. మార్చి 31 ఉదయం ధరల పెంపునకు నిరసనగా డప్పులు మోగించి, గంట కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపుఇచ్చింది.ఈ నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరను సిలిండర్‌కు రూ 50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగిస్తారని, ధరల మంటపై ప్రజలను చైతన్యపరుస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా తెలిపారు. ఏప్రిల్‌ 2 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ పార్టీ సారధ్యంలో జిల్లా, బ్లాక్‌ స్ధాయిలో ధర్నాలు, ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.ఏప్రిల్‌ 7న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్‌ శ్రేణులు, ఎన్‌జీవోలు, ప్రజలు, సామాజిక సంస్ధలతో కలిసి ప్రదర్శనలు జరుగుతాయని సుర్జీవాలా వెల్లడిరచారు. పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌ సామాన్యులపై పెను భారం మోపిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

4.నిరసనపోరు
`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు
` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై మోయలేని భారంమోపారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో ఆయనవిూడియాతో మాట్లాడుతూ..రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపడుతు న్నామన్నారు. సిలిండర్లకు దండలేసి, డప్పులు కొడుతూ, బైక్‌ ర్యాలీ, కేసీఆర్‌ , మోడీ దిష్టి బొమ్మల దగ్దం లాంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మొత్తం కాంగ్రెస్‌ లీడర్లు పాల్గొంటారని అన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ముందుకు రావాలని రేవంత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. గ్యాస్‌, పెట్రోల్‌, విద్యుత్‌ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు, బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. డిష్టి బొమ్మల దగ్దం అనంతరం కలెక్టర్ల ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. కరోనాతో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారని.. ఇటువంటి క్లిష్ట సమయంలో ధరలు పెంచడంతో ప్రజలను మరింత కష్టపెడుతున్నారన్నారు. ఏప్రిల్‌ `1 నుంచి విద్యుత్‌ చార్జీలు పెంచడంతో రూ. 5 వేల 596 కోట్లు పేదల నుంచి గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. సర్‌ చార్జీల పేరుతో ఇంకో 6 వేల కోట్లు లాక్కుంటుదన్న రేవంత్‌.. ప్రజలపై భారీగా బారం మోపుతుందన్నారు. దళిత కాలనీలకు ఉచిత కరెంటు ఇస్తామని హావిూ ఇచ్చిన సర్కార్‌.. ఇప్పుడు ఫ్రీ కరెంట్‌ కాదు కదా.. పెంచుకుంటూ పోతుందని తెలిపారు.దేశ జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పే కేంద్రం.. జీడీపీకి రేవంత్‌ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. జి`గ్యాస్‌, డి`డీజిల్‌, పి` పెంట్రోల్‌ అన్నారు. ఈ మూడిరటి ధరలు పెరగడమేనా జీడీపీ అని ప్రశ్నించారు. ఈ దోపిడిని అరికట్టేందుకే ఏఐసీసీ ఆదేశాలతో 31న నిరసన కార్యక్రమాలు చేపడుతామని.. ఉగాది రోజున గ్యాప్‌ ఇచ్చి, ఏప్రిల్‌ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్‌, మోడీ దోపిడీలను నిలదీయాలన్నారు. కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. విద్యుత్‌ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్‌ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు. ఈఆర్సీ ముందు నా వాదన వినిపించినాపెడ చెవిన పెట్టింది. విద్యుత్‌ సంస్థలు ఆర్దికంగా దెబ్బతినడానికి ప్రభుత్వ విధానమే కారణం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటూనే విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో 12,500 కోట్లు బకాయి పడ్డాయన్నారు. ప్రభుత్వ పెద్దలు కొందరు బిల్లులు ఎగవేతతో 6 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు చెల్లిస్తే విద్యుత్‌ సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ప్రజలకు ఉచితం ఇస్తున్నాం అంటూనే మరో వైపు ప్రజల నుండి ముక్కు పీల్చి విద్యుత్‌ ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది. ఐదు రాష్టాల్ర ఎన్నికల సమయంలో పెట్రో .డీజిల్‌ ధరలు పెరగలేదు. కానీ ఎన్నికలు అయిపోగానే? గ్యాస్‌..డీజిల్‌ ధరలు పెంచింది. జీడీపీ పెంచుతాం అని మోడీ సర్కారు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచింది. కేసీఆర్‌ విద్యుత్‌.. మోడీ గ్యాస్‌ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ? ఇద్దరూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలను దోచుకుంటున్న ఇద్దరూ? నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ,టీఆర్‌ఎస్‌ సమన్వయంతో దోపిడీ జరుగుతోందన్నారు. మార్చి 31 న సిలిండర్లకు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తాం అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం అన్నారు.

 

5.మళ్లీ పెరిగిన పెట్రోమంట
` వరుసగా నాలుగోరోజూ పెట్రో బాదుడు
న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):దేశంలో పెట్రోల్‌ బాదుడు కొనసాగుతోంది. లీటర్‌ పెట్రోల్‌ పై శనివారం 89 పైసలు పెంచారు. డీజిల్‌ విూద 86 పైసలు పెంచారు. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు చమురు ధరలు పెరగడం గమనార్హం. నాల్రోజుల్లో పెట్రో ధరలు దాదాపు 3 రూపాయల 20 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.80 పైసలకు చేరింది. డీజిల్‌ ధర రూ.98.10కి చేరింది. దేశ రాజధాని ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.81గా, ముంబైలో రూ.112.51, కోల్‌కతాలో రూ.106.34, చెన్నైలో రూ.103.67, బెంగళూరులో రూ.103.11, జైపూర్‌లో రూ.109.73, లక్నోలో 97.67కి లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.91, డీజిల్‌ ధర రూ.97.24కి పెరిగాయి. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.110.40, డీజిల్‌ ధర రూ.96.75గా ఉంది.

 

6.75,800 కోట్లతో ఢల్లీి ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలు
న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఢల్లీి శాసనసభలో 2022`23కు సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఢల్లీి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి మనీష్‌ సిసోడియా 75,800 కోట్లతో శనివారం సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇది ఆమ్‌ఆద్మీ ప్రవేశపెట్టిన ఎనిమిదో బడ్జెట్‌ కావడం విశేషం. ఈబడ్జెట్‌ను ’రోజ్‌గార్‌ బ్జడెట్‌’గా అభివర్ణించారు మనీష్‌ సిసోడియా. ఈ బడ్జెట్లో ఢల్లీి ఎకానవిూ పెంపు, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ’నైట్‌ ఎకానవిూ’ డెవలప్‌మెంట్‌ కోసం రాత్రి ఎనిమిది నుంచి
అర్ధరాత్రి రెండు గంటల వరకు ఫుడ్‌ ట్రక్స్‌ ఏర్పాటుకు అనుమతించారు. టూరిజం డెవలప్‌ చేసేందుకు యాన్యువల్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఐదేళ్లలో ఢల్లీి పరిధిలో ఐదు లక్షల జాబ్స్‌ కల్పిస్తామని ప్రకటించారు. అలాగే ఢల్లీిని స్టార్టప్‌ క్యాపిటల్‌గా మార్చనున్నారు. దీని ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు. అలాగే బప్రోలా పరిధిలో ఎలక్టాన్రిక్‌ సిటీని నిర్మించనున్నారు.

 

7.ఉక్రెయిన్‌ ఆరోగ్య కేంద్రాలపై 72సార్లు దాడి
` రష్యా యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
జెనీవా,మార్చి 26(జనంసాక్షి):ఉక్రెయిన్‌లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్య కేంద్రాలపై దాడి ఆధునిక యుద్ధంలో వ్యూహాత్మక చర్యగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో హెల్త్‌కేర్‌ కేంద్రాలపై 72 దాడులు జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో ద్రువీకరించింది. ఈ దాడుల్లో సుమారు 71 మంది మృతిచెందారని, 37 మంది గాయపడినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. వైమానిక దాడుల వల్ల హాస్పిటళ్లు ధ్వంసం అయ్యాయని, మెడికల్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌, సప్లయ్‌ స్టోర్స్‌ కూడా దెబ్బతిన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కొన్ని సందర్భాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని, రోగుల్ని కూడా కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. రోజువారిగా హాస్పిటళ్లను టాª`గ్గంªట్‌ చేస్తున్న ఘటనలు పెరగడం ఆందోళనకరంగా ఉన్నట్లు ఉక్రెయిన్‌ ప్రతినిధి జార్నో హబిచ్‌ తెలిపారు. డాక్టర్లు, నర్సులకు ఆరోగ్య కేంద్రాలు సురక్షిత ప్రదేశాలు కావాలని, కానీ ఇలా జరగడం దారుణమన్నారు.

 

8.ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం
` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి
` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోవిూటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక నడక చేపట్టాడు. ఛత్తీస్‌గఢ్‌, సుర్గుజ జిల్లాలోని అమ్‌దల గ్రామస్థుడు ఈశ్వర్‌ దాస్‌ అనుభవించిన వెతలను తెలుసుకుంటే హృదయం ద్రవిస్తుంది. ఆయన తన ఏడేళ్ళ కుమార్తె మృతదేహాన్ని 10 కిలోవిూటర్ల మేరకు తన భుజాలపై మోసుకెళ్ళవలసి రావడం అత్యంత దురదృష్టకరం. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సింగ్‌ దేవ్‌ ఆదేశించారు. ఈశ్వర్‌ దాస్‌ కుమార్తె సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను శుక్రవారం ఉదయం లఖన్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. ఆమె ఆక్సిజన్‌ లెవెల్స్‌ దాదాపు 60కి పడిపోయాయి. ఈ కేంద్రంలో పని చేస్తున్న రూరల్‌ మెడికల్‌ అసిస్టెంట్‌ (ఆర్‌ఎంఏ) డాక్టర్‌ వినోద్‌ భార్గవ్‌ మాట్లాడుతూ, అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదని, మరింత క్షీణించిందని చెప్పారు. ఆమె తుదిశ్వాస విడిచిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వాహనం వస్తుందని చెప్పామని, ఉదయం 9.20 గంటలకు ఆ వాహనం వచ్చిందని, అప్పటికే ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ సుమారు 10 కిలోవిూటర్లు ప్రయాణించి, తన స్వగ్రామానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవడంతో ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ దర్యాప్తుకు ఆదేశించారు. అంబికాపూర్‌ జిల్లా చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి బదులు వాహనం వచ్చే వరకు వేచి చూసే విధంగా లఖన్‌పూర్‌లోని సంబంధిత వైద్యాధికారి నచ్చజెప్పి ఉండవలసిందన్నారు.

 

9.యూపీ అసెంబ్లీ ప్రతిపక్షనేతగా అఖిలేశ్‌
` యోగి హావిూలపై పోరాడుతామని ప్రకటన
లక్నో,మార్చి 26(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు. 111 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను శాసనసభా పక్ష నేతగా ఏకక్రీవంగా ఎన్నుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు మిత్రపక్ష నేతలతో అఖిలేష్‌ సమావేశమవుతారని తెలిపారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి గెలుపొందిన ఆయన.. తన ఎంపి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడిరచడమే లక్ష్యంగా.. పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకు అంకితమవ్వాలని అఖిలేష్‌ భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే యూపి సమస్యలపై ఇక ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. యోగి ఇచ్చిన హావిూల కోసం పట్టుబడతామని అన్నారు.

 

10.సంజయ్‌.. ఉత్తి ముచ్చట్లు వద్దు
` దమ్ముంటే ధాన్యం కొనేలా చేయాలి
` తెలంగాణ పట్ల కేంద్రంమంత్రి వైఖరి దారుణం
` వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణ బిజెపి అధ్కయక్షుడిగా వడ్లు పండిరచాలని అన్న సంజయ్‌ తన హావిూని నెరవేర్చాలన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వడ్లు పండిస్తే కేంద్రమే కొంటుందన్న సంజయ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ఆయన విూడియా సమావేశంలో వినిపించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. కానీ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యవహరించిన తీరు, తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు గుండెల నిండా బాధ నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. విూ ధాన్యం విూరే కొనండి.. విూ నూకల బియ్యాన్ని విూ ప్రజలకు విూరు అలవాటు చేయండి.. మేము పీడీఎస్‌ బియ్యం ఆపేస్తాం.. విూరు నూకలను పీడీఎస్‌ కింద ఇవ్వండని పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి దిక్కు లేకుండా పోయాడని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగవడం ఖాయమన్నారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ను పట్టించుకోవద్దని బండి అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రం సహకరించట్లేదని బండి అంటున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదన్నారు. బండి సంజయ్‌ అసలు మనిషేనా.. బీజేపీ అధ్యక్షుడేనా అని ప్రశాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతు న్నామని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షతతో ఉంటే కనీసం బిజెపి నేతలు మాట్లాడక పోవడం దారుణమని అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రజలు కేంద్రానికి బిజెపికిబుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.

 

11.విద్యాయజ్ఞంలో ఎన్నారైలు భాగస్వామ్యం కండి
` మంత్రి కేటీఆర్‌ పిలుపు
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కొనసాగుతోన్న విద్యా యజ్ఞంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు. న్యూజెర్సీలోని ఎడిషన్‌ టౌన్‌ షిప్‌లో మన ఊరు మన బడి ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చేపట్టిన విద్యా యజ్ఞానికి తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని తెలిపారు. అది నిజానికి మన ఊరు ? మన బడి కార్యక్రమం కాదు.. విద్యా యజ్ఞం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ యజ్ఞంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం రూ. 7,300 కోట్లు కేటాయించారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేటీఆర్‌ కోరారు. 21 ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్టాల్రు ఏర్పడ్డాయి. ఆ రాష్టాల్రు ఇంకా కుదుటపడలేదు. కానీ ఏడున్నరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. లక్షా 24 వేలు ఉంటే.. ఏడేండ్ల తర్వాత రూ. 2 లక్షల 78 వేలకు పెరిగిందన్నారు. జీఎస్‌డీపీ 2014లో రూ. 4.9 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ. 11.54 లక్షల కోట్లకు చేరిందన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ నాయకత్వంలో ఎంతో పురోగతి సాధించింది. భౌగోళికంగా అతిపెద్ద 11వ రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 12వ రాష్ట్రం. దేశానికి ఆదాయం సమకూరుస్తున్న అతి పెద్ద రాష్టాల్లో తెలంగాణ 4వ రాష్ట్రంగా ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందన్నారు. ఏడున్నరేండ్ల తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రతో పోటీ పడుతోందన్నారు. తాను చెప్పేవన్నీ సొంత గణాంకాలు కాదు.. మోదీ గణాంకాలు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

 

12.ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు
` మరో 6నెలల పాటు కొనసాగింపు
దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. ‘‘భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్‌ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. మార్చి నెలాఖరుతో దీనికి గడువు ముగియనున్న వేళ ఈరోజు కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం పీఎంజీకేఏవై పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించినట్టు మోదీ ప్రకటించడం విశేషం.

 

13.చెంచులకు ప్రభుత్వపథకాలు చేరేలా చేస్తాం
గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌
నాగర్‌ కర్నూల్‌,మార్చి 26(జనంసాక్షి):గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్‌లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశమై, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదివాసిలకు సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్‌ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలలను గవర్నర్‌ తమళిసై ప్రారంభించారు.

 

14.త్వరలో విదేశాలకు వెళ్లే వారికీ ప్రికాషన్‌ డోసులు
` కేంద్రప్రభుత్వం సన్నాహాలు
దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీకా పంపిణీని విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 12`14, 15`18 ఏళ్ల వారికి దశల వారీగా వ్యాక్సినేషన్తో పాటు ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రికాషన్‌ డోసులు అందిస్తోంది. తాజాగా ఈ ప్రికాషన్‌ డోసు పరిధిని పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విద్య, ఉద్యోగాలు, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లే వారికి అతి త్వరలోనే ముందస్తు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు శనివారం వెల్లడిరచాయి. కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో ఆదివారం (మార్చి 27) నుంచి పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆంక్షల సడలింపులో భాగంగా ఇటీవల కొన్ని దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడో డోసు లేదా బూస్టర్‌ డోసును తప్పనిసరి చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ.. ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లే వారికి ప్రికాషన్‌ డోసు పంపిణీ అంశాన్ని ఆరోగ్యశాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.‘‘ఉన్నత విద్య, ఉద్యోగాలు, క్రీడా టోర్నమెంట్లు, వ్యాపార సమావేశాలు, అధికారిక కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రికాషన్‌ డోసు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది’’ అని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. త్వరలోనే ఈ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ప్రికాషన్‌ డోసు పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారికి ఈ డోసును అందిస్తున్నారు. అయితే ఇటీవల మార్చి 16 నుంచి 60 ఏళ్లు పైబడిన అందరూ ముందస్తు డోసుకు అర్హులేనని కేంద్రం ప్రకటించింది. ఇక జనవరి 3 నుంచి 15`18 ఏళ్లవారికి కరోనా టీకాను ప్రారంభించగా.. మార్చి 16 నుంచి 12`14 ఏళ్ల వారికి కూడా టీకా పంపిణీ ప్రారంభించారు.