అమరావతిపై హైకోర్టు తీర్పు ప్రజల విజయం

తిరుపతిలో ఐక్యకార్యాచరణ సమితి నేతల వెల్లడి

తిరుపతి,మార్చి5 (జనం సాక్షి):  అమరావతి రాజధానిపై హైకోర్టు యావత్తు ఆంధ్ర ప్రజల విజయమని అమరావతి ఐక్యకార్యచరణ సమితి నాయకులు అన్నారు. తిరుపతిలో వారు విూడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలే నడిపించారని అందుకు సహకరించిన వారిందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం మూడు ముక్కలాటను ఆపాలని, రాజకీయ కుయుక్తుల కోసం రాష్ట్ర ప్రజలను మూడు ప్రాంతాలుగా విడగొట్టొద్దని కోరారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర అనేక తప్పిదాలకు పాల్పడిరదని విమర్శించారు. అమరావతి ముంపు ప్రాంతమని, ఒకే కులానికి చెందిన ప్రాంతామని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు వెలువడిరచిన 307 పేజీల తీర్పును ఏపీ మంత్రులు, సలహదారులు చదువకుండా మళ్లీ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరిశ్రమలు ఇతర రాష్టాల్రకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు విధానాలను అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వాలంటే అమరావతిని అభివృద్ధి పరిచాలని కోరారు.