వాటర్ ట్యాంకులో పడి విద్యార్థిని మృతి


ప్రిన్సిపల్ సిబ్బందిపై తల్లిదండ్రుల అనుమానం

ప్రాణం విలువ ప్రభుత్వ పథకాలు
అనుమానంతో ప్రజలు ప్రజాసంఘాలు
 
మద్నూర్   జనం సాక్షి న్యూస్ ;మద్నూర్   మండలంలోని ఎక్లార గెట్ లో గల గురుకుల పాఠశాలలో  లో   ఫస్టియర్ చెందిన సి హెచ్ శిరీష  వాటర్ ట్యాంకులో పడి మృతి చెందినట్లుగా బిచ్కుంద సీఐ తెలిపారు  ఈ సందర్భంగా వివరాల్లోకి వెళితే  అమ్మాయి శిరీష చదువులో  వెనుక ఉండడంతో మనస్థాపానికి గురై తమ తల్లిదండ్రులకు చదువు పరంగా ఎలాంటి శక్తి సామర్థం లేకపోవడంతో  పుస్తకంలోసూసైడ్‌ నోట్ రాసి  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపారు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు  పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహానికి మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
 
_ తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని తరలించారు
 
మా తల్లి పిరికిది కాదు  ఆత్మహత్య చేసుకోలేదు
పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఏదో చేసి హతమార్చి మా చిట్టితల్లి  మృతదేహాన్ని అంత ఎత్తు గల  వాటర్ ట్యాంకులో పడేశారని లబోదిబోమంటూ
రోదిస్తూ ప్రిన్సిపల్పై ఇక్కడున్న సిబ్బందిపై బలంగా ఆరోపణలు చేశారు మా రెక్కల కష్టంపై పెంచిన మా పిల్లలను  మా రెక్కల కష్టంపై పెంచిన మా పిల్లలను నిండు ప్రాణం తో ఇవ్వాలంటూ గుండె పగులుకుంటూ  రోదిస్తున్నారు కనీసం మేము వచ్చేవరకైనా ఆగకుండా మా చిట్టితల్లి మృతదేహాన్ని పంచనామా చేసి బయటకు తరలించడం అనుమానాలు లక్షణాలు కాదా అంటూ  రోదిస్తూ తల్లిదండ్రులు ప్రశ్నించారు
అయినప్పటికీ సంబంధిలు పోయిన ప్రాణం రాదంటూ మీకున్న మరో బిడ్డను కొడుకును ప్రభుత్వ జీతం డబుల్ బెడ్రూమ్ దళిత బందు ప్రభుత్వ పథకాల ప్రలోభం పెట్టి శాంతించరు
అయినప్పటికీ తల్లిదండ్రులతో పాటు గ్రామపెద్ద సిబ్బంది మృతదేహాన్ని మాకు న్యాయం అయ్యేవరకు  పై అధికారులు ఆర్డీవో కలెక్టర్     గురుకుల పాఠశాల సెక్రెటరి మా చిట్టితల్లి హత్యకు బలమైన కారణం చెప్పేవరకు    పోస్ట్మార్టం చేయనివ్వమని మృతదేహంతో పాటు ఆందోళన చేస్తామని  మృతదేహంతో పాటు ఆందోళన చేస్తామని అన్నారు గతంలో సైతం గురుకుల పాఠశాలలో  అక్కడున్న సిబ్బంది వాచ్మన్  విద్యార్థినికి లేపుకుపోయిన తో పాటు మరో అమ్మాయి  కొన్ని రోజులు అదృశ్యం అయిన సంఘటనలు కూడా  ఈ గురుకుల పాఠశాలల్లో  చదువు సంధ్యలు ఎందొకని  ఇలాంటి సంఘటనలు మాత్రం చర్చనీయాంశంగా జిల్లాలో మారుమోగుతున్నాయి  శుక్రవారం  గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనలను చూసి  మిగితా విద్యార్థినుల తల్లిదండ్రులు  గురుకుల  పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందిపై  ఇలాంటి నమ్మకము అసలు గురుకుల పాఠశాలకు రక్షణ లేదంటూ తము పిల్లలు తాము  తీసుకుపోతామని వందలాది మంది తల్లిదండ్రులు తరలి వచ్చారు  ప్రజల్లో గురుకుల పాఠశాల పై    భారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి  విద్యార్థిని హత్య నొ ఆత్మహత్యనొ దేవుడే దిక్కు గా మారింది మరి అధికారులు ఏం న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందె