బాబాయ్‌ హత్యకేసులో జగగన్‌ దోషి

మాజీమంత్రి బండారు ఆరోపణ

విశాఖపట్నం,మార్చి1 (జనం సాక్షి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ వివేకా హత్యలో.. ఏ1 జగన్‌ అని వివేకా తనయ సునీత చెప్పారన్నారు. జగన్‌కు హత్యలు చేయడం కొత్త కాదని... పరిటాల హత్యలో జగన్‌ పాత్ర ఉందని ఆరోపించారు. హత్యను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి.. ఇంత దుర్మార్గమైన సీఎంను ఎప్పుడు చూడలేదని ఆయన విమర్శించారు. వివేక హత్య వివరాలు జగన్‌కు తెలుసని.. కానీ వివరాలు చెప్పడం లేదన్నారు. సొంత చిన్నాన్న బతికే ఉంటే అడ్డు అని భావించారు ఈ దిక్కు మాలిన సీఎం అని మండిపడ్డారు. జగన్‌ను సీబీఐ తక్షణమే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చరిత్ర ప్రజలు గ్రహించాలన్నారు. అవినాష్‌ రెడ్డి రేపో, మాపో జైల్‌కు వెళ్లడం ఖాయమన్నారు. జగన్మోహన్‌ రెడ్డి హత్య చేయగలడు, హత్య చేయించగలడు, హత్య చేసిన వారితో కాపురం చేయగలడు. జగన్‌ దేశంలో ఇద్దరికి భయపడతారు. ఒకరు మోదీ, మరొకరు అమిత్‌ షా అంటూ సత్యనారాయణ అన్నారు.