నిరసనపోరు

 


`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు
` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై మోయలేని భారంమోపారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో ఆయనవిూడియాతో మాట్లాడుతూ..రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపడుతు న్నామన్నారు. సిలిండర్లకు దండలేసి, డప్పులు కొడుతూ, బైక్‌ ర్యాలీ, కేసీఆర్‌ , మోడీ దిష్టి బొమ్మల దగ్దం లాంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మొత్తం కాంగ్రెస్‌ లీడర్లు పాల్గొంటారని అన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ముందుకు రావాలని రేవంత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. గ్యాస్‌, పెట్రోల్‌, విద్యుత్‌ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు, బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. డిష్టి బొమ్మల దగ్దం అనంతరం కలెక్టర్ల ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. కరోనాతో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారని.. ఇటువంటి క్లిష్ట సమయంలో ధరలు పెంచడంతో ప్రజలను మరింత కష్టపెడుతున్నారన్నారు. ఏప్రిల్‌ `1 నుంచి విద్యుత్‌ చార్జీలు పెంచడంతో రూ. 5 వేల 596 కోట్లు పేదల నుంచి గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. సర్‌ చార్జీల పేరుతో ఇంకో 6 వేల కోట్లు లాక్కుంటుదన్న రేవంత్‌.. ప్రజలపై భారీగా బారం మోపుతుందన్నారు. దళిత కాలనీలకు ఉచిత కరెంటు ఇస్తామని హావిూ ఇచ్చిన సర్కార్‌.. ఇప్పుడు ఫ్రీ కరెంట్‌ కాదు కదా.. పెంచుకుంటూ పోతుందని తెలిపారు.దేశ జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పే కేంద్రం.. జీడీపీకి రేవంత్‌ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. జి`గ్యాస్‌, డి`డీజిల్‌, పి` పెంట్రోల్‌ అన్నారు. ఈ మూడిరటి ధరలు పెరగడమేనా జీడీపీ అని ప్రశ్నించారు. ఈ దోపిడిని అరికట్టేందుకే ఏఐసీసీ ఆదేశాలతో 31న నిరసన కార్యక్రమాలు చేపడుతామని.. ఉగాది రోజున గ్యాప్‌ ఇచ్చి, ఏప్రిల్‌ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్‌, మోడీ దోపిడీలను నిలదీయాలన్నారు. కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. విద్యుత్‌ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్‌ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు. ఈఆర్సీ ముందు నా వాదన వినిపించినాపెడ చెవిన పెట్టింది. విద్యుత్‌ సంస్థలు ఆర్దికంగా దెబ్బతినడానికి ప్రభుత్వ విధానమే కారణం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటూనే విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో 12,500 కోట్లు బకాయి పడ్డాయన్నారు. ప్రభుత్వ పెద్దలు కొందరు బిల్లులు ఎగవేతతో 6 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు చెల్లిస్తే విద్యుత్‌ సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ప్రజలకు ఉచితం ఇస్తున్నాం అంటూనే మరో వైపు ప్రజల నుండి ముక్కు పీల్చి విద్యుత్‌ ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది. ఐదు రాష్టాల్ర ఎన్నికల సమయంలో పెట్రో .డీజిల్‌ ధరలు పెరగలేదు. కానీ ఎన్నికలు అయిపోగానే? గ్యాస్‌..డీజిల్‌ ధరలు పెంచింది. జీడీపీ పెంచుతాం అని మోడీ సర్కారు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచింది. కేసీఆర్‌ విద్యుత్‌.. మోడీ గ్యాస్‌ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ? ఇద్దరూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలను దోచుకుంటున్న ఇద్దరూ? నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ,టీఆర్‌ఎస్‌ సమన్వయంతో దోపిడీ జరుగుతోందన్నారు. మార్చి 31 న సిలిండర్లకు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తాం అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం అన్నారు.