ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు


ఆరోరోజూ కొనసాగిన రష్యా దాడులు

అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ దాడులు
ఫ్రీడమ్‌ స్క్వేర్‌ను రష్యన్‌ క్షిపణి ఢీకొట్టిందన్న మంత్రి
మిలిటరీ బేస్‌పై దాడిలో 70 మంది భద్రతా బలగాల మృతి
కీవ్‌,మార్చి1  (జనం సాక్షి):  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరోరోజు కూడా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ దాడులకు సంబంధించిన ఓ వీడియోను ఉక్రెయిన్‌ మంత్రి ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ తమ దేశంపై దాడి కొనసాగిస్తుండటాన్ని ఆ మంత్రి తీవ్రంగా ఖండిరచారు. ఉక్రెయిన్‌ మంత్రి ఎమైన్‌ ఇచ్చిన ట్వీట్‌లో, ఖార్కివ్‌ నడిబొడ్డున ఉన్న ఫ్రీడమ్‌ స్క్వేర్‌ను రష్యన్‌ క్షిపణి ఢీకొట్టిందని తెలిపారు. రష్యా ఆటవిక చర్యలకు అనేక మంది అమాయకులు బలైపోయారని తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్దాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇటువంటి వీడియోను షేర్‌ చేసింది. అంతర్జాతీయ మానవతావాద చట్టాన్ని ఉల్లంఘిస్తూ తమ దేశంపై రష్యా దాడి చేస్తోందని పేర్కొంది. సాధారణ ప్రజలను చంపుతోందని, పౌర సేవల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. పెద్ద నగరాలను లక్ష్యంగా చేసుకుని, క్షిపణులతో దాడి చేసిందన్నారు. మరోవైపు రష్యాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉక్రెయిన్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖార్కివ్‌ రీజియన్‌ హెడ్‌ ఓలెగ్‌ సినెగుబోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా ఈ నగరంపై క్రూయిజ్‌ మిసైల్స్‌ను ప్రయోగించి, యుద్ధ నేరాలకు పాల్పడిరది. నివాస ప్రాంతాలు, నగర పాలక సంస్థ భవనాలపై దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌ ప్రజలను సర్వనాశనం చేయడానికి ఈ యుద్ధం జరుగుతోందని ఓలెగ్‌ చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్‌ నగరంపై రష్యా మిస్సైల్‌ దాడి చేసినట్లు సోషల్‌ విూడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఖార్కివ్‌లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌పై ఈ దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. నగరంలోని ఫ్రీడమ్‌ స్క్వేర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టాª`గ్గంªట్‌ చేశారు. మిస్సైల్‌ దాడితో ఆ ప్రాంతంలో భారీ పేలుడు, మంట చెలరేగింది. సవిూపంలో ఉన్న బిల్డింగ్‌, కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు తర్వాత కార్లు, బిల్డింగ్‌ శిథిలాలు కనిపించాయి. ఉదయం 8 గంటలకు దాడి జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదు. ఉక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌. ఆ నగరంలో సుమారు 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.. ఓ వైపు ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతూనే ఆ దేశంపై దాడులు కొనసాగిస్తోంది రష్యా. రాజధాని కీవ్‌ వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.విూలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తోపాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్‌, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. మిలిటరీ బేస్‌పై రష్యన్‌ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైనికాధికారి వెల్లడిరచారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్‌ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్‌ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు. తొలుత ఉక్రెయిన్‌ సైనిక
స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడిరచింది. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు సాయం అందించనున్నట్లు ఆస్టేల్రియా ప్రకటించింది. 50 మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఆయుధాలను అందిస్తామని ఆస్టేల్రియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వెల్లడిరచారు. రష్యాను నిలువరిం చేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే వివిధ ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐరాసలో రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా వెల్లడిరచారు.అంతేకాదు.. ఇటు క్రీడా రంగానికి సంబంధించి కూడా రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్‌ హాకీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది.