వచ్చేనెల నుంచే విద్యుత్‌ ఛార్జీల బాదుడు?


పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

హైదరాబాద్‌,మార్చి1 (జనం సాక్షి): రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఈఆర్సీ ఛైర్మన్‌ రంగారావు స్పందించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్‌ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగారావు తెలిపారు. మార్చి 31లోపు విద్యుత్‌ సంస్కరణలపై ఈఆర్సీ తుదితీర్పు వెలువరిస్తుందని వెల్లడిరచారు. ఇదిలావుంటే దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది, ఇది పెరిగిందని తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్టాక్ట్‌ తెలిపింది. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం అధిక అభివృద్ధి ,మానవ సంక్షేమ సూచికలతో పరస్పర సంబంధం కలిగి ఉంది. రాష్ట్రంలో 1.65 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 72.8 శాతం గృహ కనెక్షన్లు, 15.4 శాతం వ్యవసాయ, 11.6 శాతం పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. 2014`15 నుండి 2020`21 వరకు 25.63 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్‌లో అత్యధికంగా డొమెస్టిక్‌ కనెక్షన్లు (17.1 లక్షలు) మరియు పారిశ్రామిక కనెక్షన్లు,ఇతరులు (4.02 లక్షలు) ఉన్నాయి. నల్గొండలో అత్యధికంగా 2.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణ స్టేట్‌ జనరేషన్‌ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 6,215 మెగావాట్లు, ఇందులో 60.7 శాతం ఉత్పత్తి సామర్థ్యం థర్మల్‌ 39.2 శాతం హైడల్‌ గా ఉంది.