నల్గొండ,మార్చి4 (జనంసాక్షి) : కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందిందని, జీఎస్టీ, జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే ముందున్నామన్నారు. గతంలో వెనకబడిన జిల్లాగా ఉన్న నల్లగొండ సస్యశ్యామలమైందన్నారు. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల మార్పులతో కొన్ని సమస్యలు వచ్చాయని, స్కావెంజర్ల విషయంలోనూ స్థానిక సంస్థల సిబ్బందినే వాడుకోవాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దీనిపై మరోసారి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
కరోనా సమయంలోనూ ఆగని సంక్షేమం: మంత్రి