బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్‌ మృతి

చిత్తూరు,మార్చి4 (జనం సాక్షి ) : చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం అగరాల వద్ద మదనప్లలె డిపోకు చెందిన ఆర్టీసీ ప్లలెబస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో సీటులోనే మృతి చెందాడు. గమనించిన ప్రయాణికుడు వెంటనే స్పందించి అప్రమత్తమై స్టీరింగ్‌ను కంట్రోల్‌ చేశాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.పూతలపట్టు` నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.