ములుగు,మార్చి4 (జనం సాక్షి ) : దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారని... అందులో భాగమే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ అన్నారు. సమ్మక్క బ్యారేజ్‌తో దేవాదుల ప్రాజెక్టులో ఏడాది పొడవునా 24 గంటల పాటు నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలకు 24 గంటల పాటు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు.
సమ్మక్క బ్యారేజ్‌లో ఏడాది పొడవునా నీరు: కడియం