పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు చేపట్టాలి

అభివృద్ది మంత్రంగా పథకాలకు పెద్దపీట వేయాల
న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): మనిషి ఎదుగడానికి అభివృద్ధి మార్గాలు తెరిచి పెట్టడమే పేదరిక నిర్మూలన పథకాల లక్ష్యం కావాలని ఐక్యరాజ్య సమితి ఘోషిస్తున్నది. ఈ భావనతోనే అభివృద్ధి వ్యూహాలకు రూపకల్పన చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులకు ప్రచారార్భాటమే తప్ప పేదరిక నిర్మూలన పట్ల చిత్తశుద్ధి ప్రకటించలేదు. అందుకే ప్రజలకు దానిపై ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. బడ్జెట్‌ అంటే సంవత్సరానికొక్కమారు ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రవేశపెట్టే తద్దినంగా ప్రజలు భావించే స్థితి వచ్చిందంటే దానికి కారణం పాలకులు వాటిని వాస్తవ పరిస్థితులకు దూరంచేసి అంకెల గారడీగా మార్చడమే. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం, వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు జవజీవాలు సమకూర్చడం, కులవృత్తులకు ఆలంబన, గ్రావిూణ సమాజాన్ని అభివృద్ధి కాముకమైనదిగా చూడటం మొదలైనవన్నీ గమనించడం ఆర్థిక ప్రగతికి దోహద పడిరదనే చెప్పాలి. పదేళ్లపాటు నిరాఘాటంగా పాలన చేసిన కాంగ్రెస్‌
దేశాన్ని, రాష్టాల్రను సర్వనాశనం చేసింది. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. కులవృత్తులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. చిన్ననీటి పారుదల రంగం వట్టి పోయింది. ప్రాజెక్టులు, మేఘమధనం పేరుతో ఉమ్మడి ఎపిని దోచుకు తిన్నారు. అయితే ఇలాంటి వారే ఇప్పుడు గగ్గోలు పెడుతన్నారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా చూపించడం ఖర్చుల్లో కోతలు పెట్టడం ప్రభుత్వాల ఘన కార్యాలుగా చెప్పుకున్నారు. బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించడం, భారాలు తరువాత వేయడం కూడా మరో ఎత్తుగడ వేయడం కాంగ్రెస్‌ హయాంలో జరిగిందని చెప్పడానికి అనుమానాలు అక్కర్లేదు. వార్షిక బడ్జెట్‌లో ఇలాంటి విన్యాసాలన్నిటినీ గతంలో ప్రదర్శించారు. బడ్జెట్‌ అంకెలకూ వాస్తవ ఖర్చులకూ సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యవహారాలు నడిచాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో వాస్తవాలకు దగ్గరగా లెక్కలు వేశారు. మనగురించి బడ్జెట్‌లో చర్చించారన్న భరోసా ఆయా వర్గాలకు కలిగింది. సామాజికాభివృద్ధిని ఆర్థిక కోణంలోనే చూడలేము. పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే కొలమానం కాదు. సమాజ సంపూర్ణ వికాసమే అసలైన అభివృద్ధి అని గుర్తిస్తేనే ముందుకు సాగుతాం. కోట్లాది శ్రమజీవులు స్వాభిమానంతో జీవించాలనే, సాధికారత సాధించాలనే తెలంగాణలో సిఎం కేసీఆర్‌ ఆకాంక్షను బడ్జెట్‌ ప్రతిబింబిస్తున్నది. గ్రావిూణ శ్రామిక సమాజ శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడానికి ఇంతటి బృహత్‌ ప్రయత్నం సాగడం స్వాగతించాలి. అభివృద్ధి ముసుగు తొడిగిన విదేశీ ఆర్థికవేత్తల సలహాలు, ఆధునికత పేర అడుక్కు తెచ్చుకున్న ఆర్థిక నమూనాలు కాదు మనకు కావలసింది. మన సమస్యలకు మన దేశీ య విధానాలలోనే పరిష్కారం సాధించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్న తీరు ముదావహం. రైతులు, గొర్రెల పెంపకం దారులు, చేపలు పట్టేవారు, కంసాలి, కమ్మరి, వడ్రంగి వంటి విశ్వకర్మవర్గీయులు, నేతపనివారు` ఇట్లా సమస్త వృత్తుల సమాహారమే గ్రావిూణ సమాజం. వీరందరికి కులవృత్తులలో తరతరాలుగా పెంపొందిం చుకున్న అపారమైన నైపుణ్యం ఉంటుంది. ఉన్నత విద్యావంతులు కూడా వృత్తి నైపుణ్యంలో వీరికి సరితూగ లేరు. గ్రావిూణ సమాజంలో అపారంగా ఉన్న మానవ వనరులను, వృత్తి నైపుణ్యాన్ని తగురీతిలో ఉపయోగం లోకి తేవడమే లక్ష్యమని గమనిస్తే తెలిసిపోతుంది. ఓ రకంగా గతంలో కన్నా మేలైన కార్యక్రమాలు సాగు తున్నాయి. ఇదంతా అభివృద్ది నిర్మాణంలో భాగంగా సాగుతున్నదని గుర్తించాలి.