మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా

 


` జీవో జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపింది.ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్‌ సర్వీసు, ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, అటవీ శాఖ ల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.