ALL NEWS

 

దేశ రాజధాని ఢల్లీిలో ప్రత్యేక ఆకర్షణగా మారిన హోర్డింగులు
ఢల్లీి,ఏప్రిల్‌ 9(జనంసాక్షి)దేశ రాజధాని ఢల్లీిలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టిఆర్‌ఎస్‌ పార్టీ రేపు ఢల్లీిలో భారీ నిరసన దీక్ష చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో వివిధ డిజైన్లతో కూడిన భారీ హోర్డింగ్‌ లను ఢల్లీిలో ఏర్పాటు చేశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించెలా ఈ హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. ఢల్లీి వీధుల్లో కేంద్రాన్ని నిలదీసేలా ఏర్పాటు అయినా ఈ హోర్డింగులు అప్పుడే విస్తృతమైన చర్చకు తెరలేపాయి.

 

1.తెలంగాణ మరో ఆత్మగౌరవ పోరాటం
`ఢల్లీి వేదికగా గర్జించనున్న రైతాంగం
` సంజయ్‌ రైతులను రెచ్చగొట్టి వరి వేయమన్నావ్‌..
` ఇప్పుడెందుకు మౌనం?` కేటీఆర్‌ సూటి ప్రశ్న
` బిజెపి నేతలను తరిమి కొట్టాల్సిందేనన్న మంత్రి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని, ఇప్పుడు యాసంగి ధాన్యం కొనబోమంటూ కేంద్రం నాటకాలు ఆడుతోందంటూ మండి పడ్డారు. యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ ముందే సూచించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కానీ, కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తమదేనని చెప్పి రైతులతో గల్లీ బీజేపీ నాయకులు వరివేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనబోమని ఢల్లీి బీజేపీ మొండికేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆగంజేసిన బీజేపీ నాయకులను తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల విూద కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని, తెలంగాణ భారతదేశంలో లేదా? అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఎక్కువ పన్నులు కడుతున్నట్లు ఎంపీ కే. కేశవరావు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై అక్కడో మాట, ఇక్కడో మాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన దీక్ష చేపట్టడానికి కేంద్రమే కారణమన్నారు. కేంద్రం మెడలు వంచైనా రైతులను కాపాడుకుంటామన్నారు. కాగా తెలంగాణ రైతాంగంపై ఎందుకంత కక్ష సాధిస్తున్నారని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక మాట.. కేంద్రంలో మరోమాట మాట్లాడుతూ భాజపా నేతలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు దిల్లీకి వస్తే.. ‘‘విూకేం పని లేదా.. ఎందుకు దిల్లీ వస్తున్నారు’’ అని తెరాస మంత్రులు, ఎంపీలను అవమానించే విధంగా కేంద్ర మంత్రులు మాట్లాడారని ధ్వజమెత్తారు.దిల్లీలో తెలంగాణ భవన్లో నామా విూడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ భారతదేశంలోనే ఉంది కదా.. అలాంటప్పుడు రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష?కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు.. మా విషయంలో కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించాలి. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం విధానాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలో మా ముఖ్యమంత్రికి బాగా తెలుసు. వారికి అండగా ఉంటాం.. రైతాంగాన్ని కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. అలాంటి గడ్డ నుంచి వచ్చిన మేము వెనకడుగు వేసేది లేదు. తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని నామా పేర్కొన్నారు.

 

2.వడ్డెరబస్తీలో కలుషిత నీటి కలకలం
` మరింతమందికి అనారోగ్యం
` బాధితుల సంఖ్య 76కు చేరిక
` లంగర్‌హౌజ్‌లోనూ కలుషిత నీరు వస్తోందని ఫిర్యాదు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):దాపూర్‌ వ్డడెర బస్తీ కలుషిత నీటి బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల సంఖ్య 76కి చేరింది. బాధితులకు కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. జనరల్‌ వార్డులో 42 మంది, చిల్డన్ర్‌ వార్డులో 34 మంది చేరారు. కొంతమందిని కాసేపట్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. వాటర్‌, ఫుడ్‌, గాలి కాలుష్యం అయినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయని సూపరింటెండెంట్‌ వరదాచారి తెలిపారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పితో బాధితులు బాధపడుతున్నారు. ఇదిలావుంటే మాదాపూర్‌ గుట్టల బేగంపేట్‌ కలుషిత నీటి ఘటన మరిచి పోకముందే.. హైదరాబాద్‌ నగరంలో లంగర్‌ హౌస్‌లో కలుషిత నీటి ఘటన వెలుగు చూస్తోంది. లంగర్‌ హౌస్‌ కాలనీలలో బాధితులు మరింత పెరుగుతున్నారు. నాలుగు నెలలుగా మురికి నీరు వస్తుందని అధికారులకు చెప్పినా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆందోళన చేస్తామంటూ కాలనీ వాసులు పిలుపునివ్వడంతో లంగర్‌ హౌస్‌లో మురుకు నీరు వస్తున్న కాలనీ వాసులకు మంచి నీటి సరఫరాను అధికారులు బంద్‌ చేశారు. కాలనీ వాసులు రోడ్డు విూద ఆందోళన చేపడుతున్నారు.

 

3.సొంతపార్టీ వారైనా సరే..కేసీఆర్‌ విడిచిపెట్టోదన్నారు
` పబ్బుల్లో గబ్బులేపితే అంతే సంగతులు
` డ్రగ్స్‌ దందా నడపాలనుకుంటే పారిపోండి
` అలాంటి వారికి నగరబహిష్కరణ తప్పదు
` ఇకముందు తెలంగాణలో డ్రగ్స్‌ దందా సాగదు
` పబ్బు యజామనులను హెచ్చరించిన మంత్రి శ్రీనివాసగౌడ్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): పబ్బుల్లో ఇకముందు ఎలాంటి డ్రగ్స్‌ పట్టుబడ్డా కఠినచర్యలు తీసుకుంటా మని, అలాంటివారిని పిడియాక్క్‌ కిందకేసు నమోదుచేసి బొక్కలో తోస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. డ్రగ్స్‌ దందా నిర్వహించాలనుకునే వారు దేశం విడిచి పారిపోవాలని కూడా హెచ్చరించారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, అందుకు అనుగుణంగా వ్యవపారాం చేయాలనుకునే వారు మాత్రమే ఉండాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఓ పబ్‌ వ్యవహారం రచ్చగా మారింది.. పలువురు ప్రముఖుల పిల్లలను తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పబ్‌ నిర్వాహకులతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పబ్‌ నిర్వాహకులకు శ్రీనివాస్‌ గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు డబ్బు ముఖ్యం కాదు.. అవసరం అయితే మొత్తం పబ్‌లే బంద్‌ చేపిస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 శాతం భాగం హైదరాబాద్‌ ఉంది. డబ్బులకు ఆశపడి కొన్ని చీడపురుగులు అసాంఘిక పనులు చేస్తున్నాయి. వీటిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్తు చేశారు.. పేకాట, గుడుంబాని అరికట్టాం.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. పబ్‌ల నిర్వహణ వెనుక ఎవ్వరు ఉన్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.. సొంత పార్టీ నేతలు ఉన్న వదిలి పెట్టకూడదు అని సీఎం ఆదేశించారు.. మా డిపార్ట్‌మెంట్‌ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉందన్నారు. మా అధికారులు మప్టీలో ఉంటూ అన్నింటిని పరిశీలిస్తున్నారు. గాంజాకి సంబంధించిన ఎన్నో కేసుల్ని ఎక్సైజ్‌ శాఖ చేధించిందని.. ఇప్పటికే పబ్‌ నిర్వాహకులకు చెప్పిన తర్వాత కూడా మళ్లీ డ్రగ్స్‌ దొరికాయి.. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న వారు ఎవరైనా ఇటువంటివి చేస్తే మానుకోండి. ఈ దందా చేయాలను కునే వారు దేశంలో ఉండకండి.. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది, విూ లాంటి వారి కోసం కాదు.. చర్యలని ముమ్మరం చేస్తున్నాం, ఈ దందాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మా దగ్గర డౌట్‌ ఉన్న వారి లిస్ట్‌ ఉంది.. వారిపై నిఘా పెట్టాం.. పబ్‌లో డ్రగ్స్‌ అమ్మితే పీడీ యాక్ట్‌ పెడతాం.. చట్టాన్ని ఉపయోగించి అవసరం అయితే నగర బహిష్కరణ చేస్తాం అంటూ సీరియస్‌గా హెచ్చరించారు. విూరు ఇలానే చేస్తే నగరంలో పూర్తిగా పబ్స్‌ లేకుండా అవుతాయన్నారు.. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిపించు కోండి.. 24 గంటల పర్మిషన్‌ ఉన్న వాటిలో కేవలం సర్వీస్‌ మాత్రమే చేయాలన్నారు.. ఇక, సీసీ కెమెరాలను ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కి అటాచ్‌ చేస్తాం.. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే దాని ఏరియా అధికారులు చూడాలి, దీనికి బాధ్యులు ఏరియా సీఐ, ఎస్సైగా తెలిపారు.. సౌండ్స్‌ కూడా పరిమితికి లోబడి ఉండాలన్నారు. దీనిపై ఫిర్యాదులు వస్తే దాన్ని తొలగిస్తామని తెలిపారు. ఇక, మొన్న జరిగిన ఘటనలో కేవలం అనుమానితులని మాత్రమే పట్టుకున్నాం. ఎవ్వరినీ కావాలని అరెస్ట్‌ చేయలేదన్న
ఆయన.. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు ఇటువంటి చర్యలకు బాధ్యులు అని తెలిస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ చేసేవారిపై కూడా నిఘా పెట్టినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడిరచారు. డ్రగ్స్‌ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అయితే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారని, ఇకపై పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటే రాష్టాన్రికి అనేక పెట్టుబడులు వస్తాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం దేశంలోనే నెంబర్‌ వన్‌గా రాష్టాన్న్రి నిలబెట్టడం. కానీ, కొందరు డబ్బుకు కక్కుర్తి పడి చేసే పనుల వల్ల చెడ్డ పేరు వస్తోంది. ఈ తరుణంలో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో పేకాట, గుడుంబాను అరికట్టగలిగాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారెవరినీ వదిలిపెట్టం. అలాగే వ్యాపారాలు చేసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేశారు.

 

4.భాషా దురభిమానం సరికాదు
అమిత్‌ షా వ్యాఖ్యలపై కెటిఆర్‌ మండిపాటు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్టాల్రకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్‌, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబమని పేర్కొన్న కేటీఆర్‌.. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మన దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయానికే వదిలేయాలి. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వ కూడదంటూ ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయని కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. నేను మొదట భారతీయుడిని.. ఆ తర్వాతే గర్విచందగ్గ తెలుగువాడిని, తెలంగాణవాడిని అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నా మాతృభాష తెలుగులో నేను మాట్లాడగలను. అయినప్పటికీ ఇంగ్లీష్‌, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలనని కేటీఆర్‌ తెలిపారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్‌ భాషను నిషేధించడం వంటి ప్రతిపాదనలు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

5.నాకు అధికారంపై మోజులేదు
` దేశంమీద ప్రేమమాత్రమే ఉంది:రాహుల్‌
దిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని వెల్లడిరచారు. అలాగే బీఎస్పీతో పొత్తు గురించి ప్రస్తావించారు. శనివారం దిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పలు విషయాలపై స్పందించారు.’రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు. వారు దాని గురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి, అధికారం ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం విూద ఆసక్తి లేదు. దానికి బదులు దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా.. నేను ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశం నాకు ఎంతో ప్రేమను పంచింది. ఇక్కడ ద్వేషాన్ని కూడా చవిచూ శాను. కానీ, నాకు కలిగే ప్రతి గాయం ఏదో ఒకటి నేర్పిస్తుంది’ అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఎన్నికల ముందు పొత్తు నిమిత్తం బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించామని రాహుల్‌ అన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్‌ చేశామని వెల్లడిరచారు. కానీ ఆమె నుంచి ఏ స్పందనా రాలేదన్నారు. ‘ఈసారి ఎన్నికల్లో మాయావతి పోటీ పడలేదు. అది విూరు చూసుంటారు. మనం పొత్తు పెట్టుకుందాం.. ముఖ్యమంత్రి పదవి విూకే అంటూ ఒక సందేశం పంపాం. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్‌ ఓడిపోయింది అది వేరే విషయం. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల గళం వినిపించేందుకు కాన్షీరామ్‌జీ ఎంతో పోరాటం చేశారు. కానీ మాయావతి ఆ గళం కోసం పోరాడేందుకు రాలేదు. అందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, పెగాసస్‌ వంటి స్పైవేర్లు. వారితో(ప్రస్తుత ప్రభుత్వం) ప్రజలు మాత్రమే పోరాడగలరు. వారు రాజ్యాంగాన్ని అమలు చేయనివ్వరు. వ్యవస్థల ద్వారా రాజ్యాంగం అమలవుతుంది. ఆ వ్యవస్థలను వారు స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థలు మన చేతిలో లేకపోతే.. రాజ్యాంగమూ మన చేతిలో ఉండదు’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు.

 

6.ఇమ్రాన్‌ సర్కారును మేం అస్తిరపరచలేదు
` అమెరికా
వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ కొద్దిరోజుల క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ కష్టాలన్నిటికీ ఆ ‘శక్తిమంతమైన దేశమే’ కారణం అన్నట్టుగా అమెరికా వైఖరిపై ఇమ్రాన్‌ విరుచుకుపడ్డారు. ఎక్కడా అగ్రరాజ్యం పేరెత్తకుండా ఆ దేశంపై విమర్శలు గుప్పించారు. ఇస్లామాబాద్లోని తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. కాగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలను అమెరికా గతంలోనే ఖండిరచినప్పటికీ.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.స్టేట్‌ డిపార్ట్మెంట్‌ ప్రతినిధి జలీనా పోర్టర్‌ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇమ్రాన్‌ ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ‘ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని సూటిగానే చెబుతున్నా. పాక్లో జరిగే పరిణామాలన్నింటికి గమనిస్తూనే ఉన్నాం. పాకిస్తాన్‌ రాజ్యాంగ ప్రక్రియను గౌరవిస్తూ, మద్దతిస్తున్నాం. కానీ ఈ తరహా ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు’ అని జలీనా స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోయే కొన్ని గంటల ముందు అమెరికా ఈ విషయంపై మరోసారి స్పందించడం గమనార్హం.ఈనెల మొదటివారంలో ఇస్లామాబాద్లో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఇమ్రాన్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ కష్టాలన్నిటికీ ఆమెరికానే కారణం అన్నట్టుగా ఆరోపణలు గుప్పించారు. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్ను తాను కలుసుకోవడం నచ్చని ఆ ‘శక్తిమంతమైన దేశం’ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటున్న భారత్కు మద్దతునిస్తూ, పాక్‌ విషయంలో ఆగ్రహంగా ఉందన్నారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే ఇస్లామాబాద్లోని అమెరికన్‌ రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి ఏంజెలా పి అగ్లెర్ను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం పిలిపించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా నిరసన తెలుపుతూ ఓ లేఖ కూడా అందజేసింది.

 

7.ఫలించిన కార్మికుల కృషి
` లాభాల బాటలో విశాఖ ఉక్కు
విశాఖపట్నం,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):నష్టాల పేరుతో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. మరో వైపు కార్మికులు చెమటోడ్చి సంస్థను లాభాల బాటలోకి తెచ్చారు. సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తూనే మరో వైపు కార్మికులు పట్టుదలగా పనిచేసి రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధించారు. సమష్టి కృషి ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆరేళ్ల తర్వాత లాభాల బాటలో పయనిస్తోంది. అమ్మకాల్లో 57శాతం వృద్ధి సాధించినట్టు ఉక్కు పరిశ్రమ సీఎండీ అతుల్‌ భట్‌ శనివారం వెల్లడిరచారు. 2021`22లో ట్యాక్స్కి ముందు రూ.835 కోట్లు లాభం వచ్చిందని, ప్రస్తుతం కార్మికుల సమష్టి కృషితో సూచికల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు చెప్పారు. బొగ్గు కొరత, అంతర్జాతీయ సవాళ్లను అధిగమించినట్టు వెల్లడిరచారు. 2020`21లో రూ.17,978 కోట్ల అమ్మకాలు, 2021`22లో రూ.28,245 కోట్ల అమ్మకాలు, 2022 మార్చి నెలలో రూ.3,685 కోట్ల ఉక్కు విక్రయించామని సీఎండీ తెలిపారు. 2 బ్లాస్ట్‌ ఫర్నేస్లో రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించామన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు, సిబ్బంది, అధికారులకు సీఎండీ అభినందనలు తెలిపారు.

 

 

cz
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హావిూలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్‌ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచిత హావిూలపై రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు చేసే ప్రయత్నం తమ అధికార పరిధిని దాటినట్లు అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉచిత హావిూలు ప్రకటించే పార్టీలను రద్దు చేయాలని బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. రాష్ట్ర విధానాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదని, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టే నిర్ణయాలను రెగ్యులేట్‌ చేయలేమని ఈసీ తెలిపింది. చట్టంలో ఎటువంటి అధికారాలు లేకుండానే అలాంటి చర్యల్ని చేపట్టలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉచిత హావిూలు ఇవ్వడం రాజకీయ పార్టీల విధాన నిర్ణయమని ఈసీ పేర్కొన్నది.

 

v
అహ్మదాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది.ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారిక వర్గాల సమాచారం. అయితే అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లుగా భావిస్తోన్న వ్యక్తి నమూనాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం పేర్కొనలేదు. సదరు వ్యక్తి మార్చి 13న కొవిడ్‌ బారిన పడగా.. వారానికి కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో తదుపరి విశ్లేషణ నిమిత్తం ఎన్‌సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతమున్న ఆధారాలను బట్టి అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనని చెప్పలేమని తెలిపింది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్‌ జెనెటిక్‌ మేకప్‌.. ఎక్స్‌ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని ఇన్సాకాగ్‌ పరిశోధనలో తెలిసిందని కేంద్రం వెల్లడిరచింది. అయితే గుజరాత్‌లో వెలుగు చూసిన వేరియంట్‌ ఎక్స్‌ఈ రకమేనా కాదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది..!
ఏంటీ ఎక్స్‌ఈ వేరియంట్‌..
ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్‌.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.

 

 

10.నేటినుంచి 18 ఏళ్లు పైబడ్డ వారికి బూస్టర్‌ డోస్‌
ఏర్పాట్లుచేసిన వైద్యారోగ్య శాఖ
యువత అంతా తీసుకోవాలన్న ఆరోగ్య శాఖ
సీరమ్‌ బూస్టర్‌ డోసు ధర తగ్గింపు
రూ.225కే సరఫరాకు నిర్ణయం
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):ఈ నెల 10 ఆదివారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బూస్టర్‌ డోసు టీకా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రెండో టీకా తీసుకుని 9 నెలలు నిండిన వారు ఇందుకు అర్హులని ఆయన వెల్లడిరచారు. కరోనా విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకోవడం కీలకమని ఆయన సూచించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంతగా ప్రభావం చూపకపోవడానికి వ్యాక్సినేషనే కారణమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో జలవిహార్‌ వద్ద.. సీవీఆర్‌ కళాశాల సెన్సేషియా ’పీస్‌ రన్‌’ పేరుతో నిర్వహించిన 5కే పరుగులో డీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జెండా ఊపి పరుగు ప్రారంభించారు. దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సే నో టూ డ్రగ్స్‌ ప్లకార్డులతో విద్యార్థులు పరుగు తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితు ల్లో ప్రపంచ శాంతి ఎంతో ముఖ్యమని... శాంతి పేరుతో నిర్వహిస్తున్న ఈ పరుగు అభినందనీయమని డీహెచ్‌ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులు, యువతలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఏళ్లు పైబడిన, రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారికి నేటి నుంచి బూస్టర్‌ డోసు ప్రారంభమవుతుంది. మూడో దశలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడానికి కారణం వ్యాక్సిన్‌ తీసుకోవడమే. కరోనా విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకోవడం చాలా కీలకం. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని శ్రీనివాస రావు సూచించారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్‌ టీకా బూస్టర్‌ అందించేందుకు సిద్ధమైంది. ఈనెల 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్‌ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూరైనవారు బూస్టర్‌ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్‌ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూరైంది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్‌ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12`14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.18ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు పంపిణీ చేయనుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్‌ డోసు తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్‌ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.బూస్టర్‌ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్‌ డోసు ధర రూ.600 కే అందుబాటులోకి తెస్తామన్నారు. దీనితోపాటు కొవావాక్స్‌ బూస్టర్‌ డోసు ధర రూ.900గా ఉంటుందని ఓ కేంద్రమంత్రి అదర్‌ పూనావాలా వెల్లడిరచారు. ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం టీకా ధరలో డిస్కౌంట్‌ ఇస్తామన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో కేసులు బయటపడడం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవర పెడుతోంది. భారత్‌కు కూడా ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ప్రికాషన్‌ డోసులపై దృష్టి పెట్టింది.కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని పలు
పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు వేసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని బ్రిటన్‌ పరిశోధకులు వెల్లడిరచారు.
సీరమ్‌ బూస్టర్‌ డోసు ధర తగ్గింపు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్‌ డోస్‌ వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. దాంతో బూస్టర్‌ డోసును ట్యాక్స్‌ కాకుండా రూ. 600లకు అమ్మాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించారు. బూస్టర్‌ డోస్‌ను రూ. 225లకే ప్రైవేట్‌ ఆస్పత్రులకు అందచేయనున్నట్లు సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా తెలిపారు. ’కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రైవేట్‌ ఆసుపత్రులలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించాలని సీరమ్‌ కంపెనీ నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 18 ఏండ్లు పైబడిన వారికోసం ముందు జాగ్రత్తగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం మరోసారి అభినందిస్తున్నాం’ అని పూనావాలా ట్వీట్‌ చేశారు.
బూస్టర్‌ డోసు సర్వీస్‌ చార్జీ రూ.150 మించవద్దు
బూస్టర్‌ డోసు సర్వీస్‌ చార్జీ రూ.150 మించవద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. అలాగే తొలి, రెండో డోసుగా తీసుకున్న టీకానే బూస్టర్‌ డోసు లేదా ప్రికాషన్‌ డోసుగా తీసుకోవాలని సూచించింది. అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రారంభం కానున్న ప్రికాషన్‌ డోసు విధివిధానాలపై చర్చించారు. దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. దేశంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ కలకలం రేపుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్‌లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రికాషన్‌ డోసుగా పేర్కొనే బూస్టర్‌ డోసుకు కేంద్రం ప్రభుత్వం శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 18 ఏండ్లు నిండి, సెకండ్‌ డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు అర్హులని తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోసు టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే ఇది ఉచితం కాదు. కరోనా టీకా ప్రికాషన్‌ డోసు కావాలనుకునేవారు డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి కొవిన్‌లో రిజిస్టేష్రన్‌ కోసం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అయితే బూస్టర్‌ డోసు ధర ఎంత అన్నది స్పష్టం చేయలేదు.మరోవైపు కొవిషీల్డ్‌ టీకాను తయారు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా బూస్టర్‌ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడిరచారు. అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్‌ డోసు కొవిషీల్డ్‌ టీకాలపై భారీగా డిస్కౌంట్‌ ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, భారత్‌ బయోటిక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ధర రూ.900గా ఉండనున్నది. దీనికి కూడా పన్నులు అదనం. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రికాషన్‌ డోసు సర్వీస్‌ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పరిమితి విధించింది.

 

 

12.కరోనా ముగింపు దశలో లేదు..
సగటున నాలుగు నెలలకో కొత్త వేరియంట్‌..!
నిత్యం 15 లక్షల కొత్త కేసులొస్తున్నాయి: గుటెర్రస్‌
న్యూయార్క్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గుతూ..అంతలోనే కొంత వేరియంట్ల రూపంలో కలవరపెడుతోంది. పొరుగున చైనాతో సహా అమెరికా, ఐరోపా దేశాల్లో మరో దఫా విజృంభిస్తోంది. దీనిపై ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ముగింపు దశలో లేదని హెచ్చరించారు.’ఇప్పుడు ప్రతిరోజూ 15 లక్షల కరోనా కేసులొస్తున్నాయి. ఆసియాలో మహమ్మారి ఉద్ధృతంగా ఉంది. ఐరోపాలో కొత్త వేవ్‌ విస్తరిస్తోంది. అలాగే మహమ్మారి ప్రారంభం నుంచి చూసుకుంటే కొన్ని దేశాల్లో ప్రస్తుతం అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు, వ్యాప్తి ఎంత వేగంగా ఉంటాయనేదానికి ఒమిక్రాన్‌ మనకొక రిమైండర్‌’ అంటూ గుటెర్రస్‌ అన్నారు.ప్రపంచ జనాభాలో మూడిరట ఒకవంతు మందికి ఇంకా టీకా అందలేదన్నారు. కానీ, కొన్ని సంపన్న దేశాలు మాత్రం రెండో బూస్టర్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలను ఎత్తిచూపుతోందన్నారు. ‘ఈ ఏడాది మధ్యనాటికి 70 శాతం మంది జనాభాకు టీకా అందించాలన్న లక్ష్యానికి మనం చాలా దూరంలో ఉన్నాం. మరోపక్క సగటున ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్‌ వెలుగుచూస్తోన్న తరుణంలో సమయం చాలా ముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, ఔషధ సంస్థలు కలిసి పనిచేయాలి. సంపన్న దేశాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతివ్యక్తికి టీకా అందేలా కృషి చేయాలి’ అని సూచించారు. తాజాగా ఒమిక్రాన్‌ ఉత్పరివర్తనం చీఇ పుట్టుకురాగా.. ఒమిక్రాన్‌ కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

13.తీర్పులు అనుకూలంగా లేకుంటే
ప్రభుత్వాలు న్యాయమూర్తుల్ని దూషిస్తున్నాయి
` సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం వ్యాఖ్యలు
ఢల్లీి,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తంచేసే అభిప్రాయాలు తమ అభీష్టానికి అనుగుణంగా లేనప్పుడు...ఆయా ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడిరది. ఇది కొత్తపోకడ, అత్యంత దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. ఇదివరకు ప్రైవేటు పార్టీలు మాత్రమే ఈ పని చేసేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్‌ అధికారి అమన్‌కుమార్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాలుచేస్తూ... ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవినీతి వ్యతిరేక కార్యకర్త ఉచిత్‌ శర్మ కూడా దీనిపై అప్పీలు దాఖలుచేశారు.వీటిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ` ‘’విూరు సీనియర్‌ న్యాయవాది. ప్రభుత్వం కోర్టును దూషించడం మొదలుపెట్టింది. కోర్టులోనూ రోజూ దీన్ని చూస్తున్నాం. ఈ కొత్త పోకడ గురించి మాకంటే ఎక్కువగా విూకే తెలుసు. ఇది చాలా దురదృష్టకర పరిణామం’’ అని పేర్కొన్నారు.ఇదీ కేసు..: 2004లో సర్వీసులో చేరిన ఐఏఎస్‌ అమన్‌ కుమార్‌సింగ్‌ మధ్యలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి, కాంట్రాక్టు విధానంలో సెక్రటరీగా చేరారు. సర్వీసులో చేరినప్పుడు అమన్‌కుమార్‌కు రూ.11 లక్షలు విలువైన ఆస్తి ఉండగా, ఆ తర్వాత రూ.2.76 కోట్ల విలువైన ఏడు ఆస్తులను కూడబెట్టారని ద్వివేది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు` అవినీతి వ్యతిరేక కార్యకర్త ఉచిత్‌ శర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. సంభావ్యత (ప్రాబబిలిటీ) ఆధారంగా నమోదైన కేసుగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు దీన్ని పేర్కొందని, సంభావ్యత ఆధారంగా ఏ వ్యక్తిపైనా విచారణ చేపట్టబోమని వ్యాఖ్యానించిందన్నారు. నిజానికి సదరు అధికారి రూ.2,500 కోట్లు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయని దవే పేర్కొన్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఈ అప్పీలు అతిశయోక్తిగా ఉందంటూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.