all news

 

1.ప్రపంచానికి గమ్యస్థానం తెలంగాణే..
` తెలంగాణపై కేంద్రం శీతకన్ను
` అనేక పథకాలకు కేంద్రం మోకాలడ్డుతోంది
` ఈ`కామర్స్‌పై జాతీయ విధానం రావాలి
` సాంకేతికతను అందిపుచ్చుకుని సాగాలి
` ఆన్‌లైన్‌, సైబర్‌ సెక్యూరిటీపై శ్రద్ద తీసుకోవాలి
` పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ భేటీలో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):ఈ`కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ అండ్‌ కామర్స్‌ సమావేశం నగరంలోని శాసనసభ కమిటీ హాలులో జరిగింది. కమిటీ చైర్మన్‌ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్‌ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్‌, ఈ`కామర్స్‌ సంస్థలకు చెందిన సీనియర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు ఇతర శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక, సాప్ట్‌వేర్‌ రంగంలోని విప్లవాత్మక మార్పులను భారతదేశం అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన విధానపరమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. ఈ`కామర్స్‌పై జాతీయపరమైన పాలసీని సత్వరమే తీసుకురావాలన్న కేటీఆర్‌.. ఇందులో ఈ`కామర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ పేమెంట్స్‌, అత్యుత్తమ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండడం వంటి సంబంధిత రంగాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు.సిటిజన్‌ సర్వీస్‌ డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలని సూచించారు. ఈ`కామర్స్‌, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులని మనం ఆపడం మానేసి, దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచాన్ని లీడ్‌ చేసే విధంగా భారతదేశాన్ని తయారు చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా అందిపుచ్చుకోవడంలో భారత దేశ ప్రజలు ముందు వరుసలో ఉంటారన్నారు. ఇందుకు ఈ కామర్స్‌ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఈ`కామర్స్‌ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ లిటరసీపైన దృష్టి సారించాల న్నారు. భారత దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్‌ లిటరసీ ని పెంచే ప్రయత్నం చేయాలని, భారత ప్రభుత్వం చేపట్టిన భారత్‌ నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్‌ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి అవసరమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు. ఇంటర్నెట్‌ ద్వారా లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని అందించినప్పుడు అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు కూడా ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, సేవలు అందే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైబర్‌ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్‌ యూనివర్సిటీతో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించే పక్రియను ప్రారంభించిందన్నారు. ఇదే అంశంపై జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కామర్స్‌ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్‌ కమిటీ ముందు తెలంగాణ ప్రగతిని కేంద్రం ఎదుట ఉంచడంతో పాటు.. రాష్టాన్రికి కేంద్రం నుంచి ఎదురవుతున్న వివక్షను మంత్రి కేటీఆర్‌తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా వచ్చిన విభజన హావిూలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని, కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి మొదలుకొని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హావిూలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అడిగిన ఇండస్టియ్రల్‌ కారిడార్‌లతో పాటు డిఫెన్స్‌ కారిడార్‌ ఫార్మాసిటీ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడంపైన అత్యంత విశ్వాసం కలిగి ఉందని, ఈ దిశగా ఆదిలాబాద్‌ లోని సీసీఐని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్నారు. నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఏడున్నర సంవత్సరాలుగా తలసరి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని అన్నారు. మేకిన్‌ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని హావిూలు కూడా అమలు చేయకుండా తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతోందని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను సమావేశంలో ప్రస్తావించారు. ఈ కామర్స్‌ రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ తదితర అంశాలపై భేటీలో చర్చ కొనసాగింది. విభజన హావిూలు అమలు చేయకుండా కేంద్రం మొండిచేయి చూపుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. వివిధ పథకాల కింద రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం శీతకన్ను వేస్తోందని.. కేంద్రం బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్‌డీసీ, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదన్నారు.తెలంగాణకు దక్కాల్సిన బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హావిూలను కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ అడిగిన ఇండస్టియ్రల్‌ కారిడార్లతోపాటు డిఫెన్స్‌ కారిడార్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కులకు అవసరమైన ఆర్థికసాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని అభిప్రాయపడ్డారు.

 

2.ఉచితవిద్యా,వైద్యం ఇస్తామంటే మేమద్దన్నామా..!
` కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరేకదా!
` దమ్ముంటే దేశవ్యాప్తంగా అమలుచెయ్యండి
` బండి సంజయ్‌ భాజపా పాలిత రాష్ట్రాలు చూసొస్తే మంచిది:మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): బిజెపి పాలన గురించి పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవాలని మంత్రి కెటిఆర్‌ బండి సంజయ్‌కు సలహా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పాదయాత్రలను అడ్డుకునే కుట్ర చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను పలువురు కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బండి వ్యాఖ్యలపై కేటీఆర్‌ గాటుగానే స్పందించారు. బండి సంజయ్‌ గద్వాల, వనపర్తి జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారని, పక్కనే పది కిలోవిూటర్లు దాటి వెళ్తే కర్నాటక రాయ్‌చూర్‌ జిల్లా ఉందని, అవసరమైతే కార్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడికి వెళ్లి బీజేపీ పాలన గురించి అడిగి తెలుసుకో వాలన్నారు. కర్నాటకలోని రాయ్‌చూర్‌, యాదగిరి, బీదర్‌ జిల్లాలో గానీ తెలంగాణలో ఇస్తున్నట్లు 24 గంటల కరెంటు, ఇంటింటికీ నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, తెలంగాణలో ఇస్తున్న తరహాలో పింఛన్లు వస్తున్నాయా? చూడాలన్నారు. కర్నాటకలో పనులకు 40శాతం మంత్రులకు కవిూషన్లు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గుజరాత్‌లో ఇవాళ కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. ఇక్కడ బండి సంజయ్‌ ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయ్‌చూర్‌ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో పాలన, సంక్షేమం బాగుందని.. మమ్మల్ని తీసుకెళ్లి తెలంగాణలో కలపమంటున్నానంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు గుర్తు చేశారు. పాదయాతను అడ్డుకునే ఖర్మ మాకు లేదని.. కావాలంటే పక్కకున్న కర్నాటక వెళ్లి చూసిరా.. అక్కడ బీజేపీ ఎలా ఉందో ?.. ఇక్కడ ఎలా ఉందో చూసి సిగ్గు తెచ్చుకో అంటూ మండిపడ్డారు. బండి సంజయ్‌ ఏం మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని కేటీఆర్‌ ప్రశ్నించారు. ’పాలమూరు ఎత్తిపోత పథకానికి జాతీయ హోదా ఇవ్వం.. పక్కనే ఉన్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం’ అని సిగ్గులేకుండా చెప్పుకు తిరుగుతున్నావా?.. పక్కనే ఉన్న కర్నాటక ప్రభుత్వానికి మాత్రం వేల కోట్లు ఇచ్చి సహకరిస్తాం, ఇక్కడ నీతి ఆయోగ్‌ చెప్పినా ఒక్క పైసా ఇవ్వమని చెప్పి తిరుగుతున్నావా?.. కృష్ణా నది విూద కృష్ణా రివర్‌ బోర్డ్‌ అనే శిఖండి సంస్థను తెచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా, నదీ జలాల వాటా తేల్చకుండా ఏడేళ్ల నుంచి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా ?.. పాలమూరులోని వెనుకబడిన అలంపూర్‌ నుంచి మాచర్ల దాకా నాగర్‌ కర్నూల్‌ విూదుగా రైలు లైన్‌ మంజూరు చేయలేదు.. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినం.. అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తమని తిరుగుతున్నవా? అంటూ ధ్వజమెత్తారు. ఏం మొఖం పెట్టుకొని తిరుగుతున్నావని.. పాలమూరుకు చేసిందేందని ప్రశ్నించారు. ఇవాళ మొత్తం ప్రతి గ్రామంలో పథకాలు మావే.. ప్రతి గ్రామం మా మోదీ పైసలే ఉన్నాయని చెబుతున్నాడన్నారు. ఇదే నిజమైతే నేను సవాల్‌ చేస్తున్నా.. బండి సంజయ్‌ చెప్పిన మాట నిజమే అయితే.. పక్కన కర్నాటకనే ఉందని, ఎక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడి గ్రామాల్లో వైకుంఠ ధామాలు, నర్సరీలు, ఊరూరా హరితహారం లేదని, ఇంటింటికీ నల్లాలు లేవని, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎందుకు లేవన్నారు. బండి చెప్పే మాటలన్నీ అసత్యాలేనని ప్రజలకు తెలుసునన్నారు. జోగులాంబ ఆలయం వద్ద నుంచే పాదయాత్ర ప్రారంభించాడని, జోగులాంబ ఆలయానికి నీ ప్రభుత్వం నాలుగు పైసలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వేములవాడ ఆలయానికి ఇచ్చారా? జోగులాంబ ఆలయానికి ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెల్లారి లేస్తే రాముడు రాముడు అంటారనీ.. మరి భద్రాద్రి రాముడికి ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పనికిమాలిన అపసవ్యపు కూతలు మానాలని హితవు పలికి, ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అంటున్నారని.. కేంద్రంలో ఉన్నది బీజేపీయేనని.. దేశవ్యాప్తంగా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తానంటే ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందించాలని, ప్రైవేటు హాస్పిటళ్లు, విద్యా సంస్థలను ఎత్తివేద్దామని.. దమ్ముంటే మోదీకి చెప్పి చట్టం చేసి పాస్‌ చేయించాలని, తాము మద్దతిస్తామన్నారు. బండి డొల్లమాటలు, సొల్లు పురాణం నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెబుతారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాయచూర్‌ ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు రాయచూర్‌ను తెలంగాణలో కలపాలన్నారని గుర్తు చేశారు. అక్కడికి వెళ్లి చూసొచ్చి సిగ్గు తెచ్చుకోవాలని బండి సంజయ్‌పై కేటీఆర్‌ మండిపడ్డారు. నీ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకేం లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

 

3.ఆమ్‌వే సంస్థ ఆస్తుల జప్తు
ఆస్తుల అటాచ్‌..బ్యాంక్‌ అకౌంట్‌ సీజ్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థ ఆమ్‌వేకు ఈడీ షాక్‌ ఇచ్చింది. రూ.757 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆస్తులతో పాటు ఫ్యాక్టరీలకు సంబంధించిన స్థలాలను కూడా సీజ్‌ చేసింది. రూ.411 కోట్ల ఆస్తులు, రూ.345 కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఫ్రీజ్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్‌వే సంస్థ 36 అకౌంట్లను ఈడీ ఫ్రీజ్‌ చేసింది. ఆమ్‌వే రూ.27,562 కోట్ల వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది. కమిషన్‌ రూపంలో రూ.7,588 కోట్ల చెల్లింపులు జరిగినట్లు వెల్లడిరచారు. అమెరికా, ఇండియాలో ఉన్న మెంబర్స్‌కు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అమెరికాకు చెందిన బ్రిట్‌ వరల్డ్‌వైడ్‌, నెట్‌వర్క్‌ 21లో ఆమ్‌వే షేర్లు గుర్తించారు. ఉమ్మడి రాష్టాల్లో ఆమ్‌వేపై మొదటిసారి సీఐడీ విచారణ జరిపింది. ఆమ్‌వే సీఈవోను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

 

4.యురియా సరఫరాలో అడ్డంకులు సృష్టించొద్దు
` ఎరువుల సరఫరాలో కేంద్రం జాప్యం సరికాదు
` తెలంగాణలో యూరియాను సిద్ధం చెయ్యండి
` ఎరువుల వినియోగంలో రైతులను చైతన్యం చేయాలి
` అధికారులతో సవిూక్షలో మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): రష్యా ` ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రసాయన ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరత సాకుగా చూపించి రాష్ట్రాలకు ఎరువుల సరఫరాలో కేంద్రం జాప్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.రైతుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్రానికి ఇది ఏమాత్రం సముచితం కాదని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారి కె.రాములు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు సవిూక్షలో పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న వానాకాలం సాగుకు సంబంధించి రసాయన ఎరువుల ముందస్తు నిల్వలు, కేటాయింపులు, గ్రామాలకు చేరవేత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.’’రాబోయే వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది. వీటిలో 10.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 9.4 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలి. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్‌ 15 నాటికి సిద్ధం చేయాలి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సీజన్‌ ముందే ప్రారంభమవుతున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో అవసరమైన రసాయన ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలి. అందుకే రాష్ట్రానికి ఎప్పటికప్పుడు అవసరమైన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాశాం. వివిధ నౌకాశ్రయాల్లో అందుబాటులో ఉన్న డీఎపీ, కాంప్లెక్సు ఎరువులు తెలంగాణకు పంపించాలని విజ్ఞప్తి చేశాం. వానాకాలం ఆరంభానికి ముందే మే నెలలో గ్రావిూణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి’’ అని నిరంజన్‌రెడ్డి అన్నారు.

 

5.బండి సంజయ్‌ పాదయాత్రలో స్పల్ప ఉద్రిక్తత
` అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు
` బిజెపి,టిఆర్‌ఎస్‌ పరస్పర నినాదాలతో టెన్షన్‌
` పరిస్తితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
జోగులాంబ గద్వాల,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోటా పోటీగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు నినాదాలు చేశారు. ప్రతిగా కెసిఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో... రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అయితే సంజయ్‌ యాత్రను అడ్డుకోవటంపై బీజేపీ నేతలు మండిపడ్డారు.అంతకుముందు అలంపూర్‌ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో బండి సంజయ్‌ మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ లక్ష కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదో కేసీఆర్‌ చెప్పాలన్నారు. రైతులను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. నకలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవటం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్‌ విస్మరించారని డీకే అరుణ అన్నా. ఆర్డీఎస్‌ ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్‌ ఇటిక్యాల మండలం వేములలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతుండగా కొంతమంది తెరాస కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు తెరాస కార్యకర్తలను చెదరగొట్టారు. వారిని వేరే ప్రదేశానికి తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న తెరాస కార్యకర్తల వైపు భాజపా శ్రేణులు దూసుకెళ్లాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలగజేసుకొని పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పాదయాత్ర తిరిగి కొనసాగింది. ఉద్రిక్తతకు ముందుగా వేములలో ప్రసంగించిన బండి సంజయ్‌.. రాష్ట్రంలో తెరాస పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ ఇచ్చిన హావిూలేవీ ఇంతవరకూ నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. నీళ్లు, నియామకాల విషయంలో కేసీఆర్‌ మాట తప్పారన్న బండి సంజయ్‌... కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నేడు వేముల నుంచి బట్ల దిన్నె, షాబాద్‌ విూదుగా ఉదండపూర్‌ వరకు పాదయాత్ర సాగనుంది. కేసీఆర్‌ ఎన్నికల్లో గెలిస్తే గద్వాల జిల్లాకు నీళ్లిస్తామన్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. అన్నీ హావిూలే కానీ అమలులో మాత్రం శూన్యం. లీటర్‌ పెట్రోల్‌కు రూ.30 కమిషన్‌ తీసుకుంటూ కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. ప్రజలంతా ఈ మోసాన్ని గమనించాలని బండి సంజయ్‌ అన్నారు.

 

6.లిఖింపూర్‌ ఖేరీ ఘటనలో ఆశిష్‌ బెయిల్‌ రద్దు
` సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ
` అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులు రద్దు
` బెయిల్‌ ఇవ్వండంపై ధర్మాసనం అభ్యంతరం
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు... వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించిందని సుప్రీం పేర్కొంది.హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కీలక నిందితుడుగా ఉన్నాడు. అక్టోబరు 9వతేదీన ఆశిష్‌ మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌ మంజూరైంది. అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు. నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్‌ మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండిరచారు. నిరసన తెలిపిన రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పేర్కొంది. అంతకుముందు అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వారంలోపు లొంగిపోవాలని మిశ్రను ఆదేశించింది. అతనికి బెయిల్‌ మంజూరు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. బాధితుల పక్షాన ఉన్న అంశాలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమించిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిశ్రా బెయిల్‌ విషయంపై సుప్రీంకోర్టులో ఈనెల 4న కూడా విచారణ జరిగింది. ఆశిష్‌ మిశ్రకు బెయిల్‌ మంజూరు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు చెప్పిన కారణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్‌) సూచనలను యూపీ ప్రభుత్వంపై పట్టించుకోకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటిస్తూ.. విచారణలో కొన్ని కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. ముఖ్యంగా బెయిల్‌ మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్‌ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ ఎన్‌.వి.రమణ తప్పుపట్టారు.’ఇలాంటి పిచ్చితనాన్ని అంగీకరించం. ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించాలి. కానీ.. బెయిల్‌ పరిశీలనకు ఈ విషయాలు ఏ మాత్రం అంగీకారయోగ్యమైనవి కావు. అతనికి తూటా తగిలింది. కారు ఢీకొట్టింది. బండి చక్రం, స్కూటర్‌ ఢీకొట్టింది. ఏమిటిదంతా’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆశిష్‌ ఎవరిపైనా కాల్పులు జరపలేదని, ఇందుకు పోస్టుమార్టం నివేదికే సాక్ష్యమని బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొనడాన్ని సీజేఐ ధర్మాసనం తప్పుపట్టింది. విచారణలో తేలాల్సిన అంశాలను బెయిల్‌కు ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. ’పోస్టుమార్టం తదితర నివేదికల్లోకి న్యాయమూర్తి ఎందుకు వెళ్లారు. బెయిల్‌పై విచారణకు గాయాలు తదితర అంశాల ప్రస్తావన అనవసరం’ అని సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమకోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయ పడిరది. ఘటనపై దాఖలైన సుదీర్ఘ అభియోగపత్రాన్ని పట్టించుకోకుండా..కేవలం పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై ఆధారపడి నిందితుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోజు వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసి ఈరోజు వెలువరించింది. గతేడాది అక్టోబర్‌ 3న హింసాత్మక ఘటన జరిగింది. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడి కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్‌ అయింది. దీంతో ఆశిష్‌ మిశ్రను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

 

 

8.ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ పాండే..
` ఇంజినీర్‌కు తొలిసారి సైన్యం బాధ్యతలు
దిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):భారత సైన్యం సారథిగా లెఫ్టినెంట్‌ జనరల్‌? మనోజ్‌ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ చర్చలు జరిపి..పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌? జనరల్‌ నరవాణే ఏప్రిల్‌? 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ పాండేను ఆయన వారసుడిగా కేంద్రం ఖరారు చేసింది. కార్ప్స్‌? ఆఫ్‌? ఇంజినీర్స్‌? నుంచి ఆర్మీ చీఫ్‌? కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్‌? కోసం పాండేతోపాటు జై సింగ్‌ నయన్‌, అమర్‌?దీప్‌ సింగ్‌ భిందర్‌, యోగేంద్ర దివ్రిూ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్‌ అయిన పాండేకే బాధ్యతలను అప్పగించింది.

 

9.లివివ్‌పై రష్యా క్షిపణుల వర్షం
` పశ్చిమ ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనల గురి..
కీవ్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. తూర్పు ప్రాంతంలో పూర్తి పట్టు సాధించడం కోసం దక్షిణ నగరమైన మేరియుపొల్‌ను హస్తగతం చేసుకున్న రష్యా..ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌పై గురి పెట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ప్రధాన నగరమైన లివివ్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. సోమవారం ఉదయం ఐదు శక్తిమంతమైన క్షిపణులను ఈ నగరంపై ప్రయోగించినట్లు తెలిసింది.లివివ్‌తో పాటు పశ్చిమ ఉక్రెయిన్‌లోని దాదాపు చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు యుద్ధ ప్రభావం తక్కువగానే ఉంది. లివివ్‌ను సురక్షిత నగరంగా పేర్కొంటూ.. కీవ్‌, మేరియుపొల్‌ వంటి నగరాల నుంచి అనేక మందిని ఈ ప్రాంతానికి తరలించారు కూడా. అయితే తాజాగా ఈ నగరంపై రష్యా సేనలు గురిపెట్టాయి. సోమవారం ఉదయం ఐదు క్షిపణులు తమ నగరంపై పడినట్లు లివివ్‌ మేయర్‌ ఆండ్రీ సదోవీ సోషల్‌విూడియాలో వెల్లడిరచారు. అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణుల వల్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.గతవారం రష్యాకు చెందిన ఓ భారీ యుద్ధ నౌకను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్యా మరింత రెచ్చిపోయింది. కీవ్‌పై దాడులు మరింత పెంచుతామని క్రెమ్లిన్‌ హెచ్చరించింది. అన్నట్లుగానే కీవ్‌ వెలుపల ఉన్న ఆయుధ కర్మాగారాలు, సైనిక స్థావరాలపై గత కొద్ది రోజులుగా క్షిపణులతో దాడి చేస్తోంది. నిన్న రాత్రి కూడా ఓ ఆయుధ ప్లాంట్‌పై దాడి చేసింది. దీంతో పాటు ఖర్కివ్‌ నగరంలోనూ దాడులను పెంచింది. ఖర్కివ్‌లో ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడిరచారు.రష్యా దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశ సైనికులు తమ భూభాగంలో తీవ్ర హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘’స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను కిడ్నాప్‌ చేస్తున్నారు. ప్రజలను హింస్తున్నారు. అయినప్పటికీ మేం లొంగిపోయేది లేదు. మా దేశాన్ని రక్షించుకోవడం కోసం, ఈ యుద్ధంలో విజయం కోసం చివరివరకు పోరాడుతాం. రష్యా దారుణాలకు అడ్డుకునేందుకు మాకు ఆయుధ సాయం చేయండి’’ అంటూ జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను మరోసారి అభ్యర్థించారు.