ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు

 

` 29న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహణ 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్‌ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని సీఎం కేసిఆర్‌ తెలిపారు.ఈ సందర్భంగా సీఎం కేసిఆర్‌ మాట్లాడుతూ...’’ తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు  ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది..’’అని తెలిపారు.