కేంద్రరైతువ్యతిరేక విధానాలకు ఢల్లీిలో ఎండగట్టాం

 



` కొత్తవ్యవసాయపద్ధతులు అవలంభించాలి:మంత్రి నిరంజన్‌రెడ్డి
సిద్ధిపేట,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢల్లీి దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢల్లీిలో సీఎం కేసీఆర్‌ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సిద్ధిపేటలో ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో రైతులు పండిరచిన ప్రతీ ధాన్యం గింజను కొంటుందని సీఎం ప్రకటించడం అందరికీ తెలుసునన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నిమిషం చప్పట్లు కొట్టి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపాలన్నారు. ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా ఆయిల్‌పామ్‌ తోటలు విస్తరణ చేపట్టడం, మూడేళ్ల తర్వాత వచ్చే గుత్తులను ఫ్యాక్టరీకి అమ్మాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఫ్యాక్టరీ నిర్మాణం 50 ఎకరాల్లో సిద్దిపేటలో పెట్టేందుకు మంత్రి హరీశ్‌ రావు సహకారం ఇవ్వడం అభినందనీయం. రూ.300 కోట్ల వెచ్చించి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు చెప్పారు.ప్రతీ సందర్భంలో రాష్ట్ర ప్రజానికం రెండు కారణాలతో సిద్ధిపేట వైపు చూస్తున్నారని.. సిద్ధిపేట వైపు చూస్తున్నారని.. రాష్ట్రంలో ఏ కొత్త పని జరిగినా అది సిద్ధిపేటలో ప్రారంభమవుతుందన్నారు. మేం ఏ తలపెట్టిన ఏం పని కావాలన్నా ఆ డబ్బులు ఇచ్చేది సిద్ధిపేట బిడ్డ సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అందుకే సిద్ధిపేట ప్రాంత ప్రజలంటే మా అందరికీ గౌరవం, అభిమానమన్నారు. సిద్దిపేటలో శంకుస్థాపన చేసిన ఆయిల్‌ ఫెడ్‌ కార్మాగారం రాబోయే పది తరాల ప్రజల జీవితాల తలరాతను మార్చే గొప్ప కార్యక్రమం అన్నారు. తెలంగాణ రైతాంగం పామాయిల్‌ పంట వైపు చూడకుండా పత్తి, జొన్నలు, రాగుల వంటి వాటి వైపే చూసేలా ఆనాటి పాలకులు వ్యవహరించారని, దేశంలోని ఆయా రాష్ట్రాల పంటలు, భవిష్యత్తు దృష్ట్యా సీఎం కేసీఆర్‌ గారు పామాయిల్‌ పంటను ప్రోత్సహించాలని నిర్ణయించారన్నారు. ఒక్క ఎకరా వరి బదులు నాలుగు ఎకరాల ఆయిల్‌ పామ్‌ తోటలు, నీటిని, విద్యుత్‌ను వినియోగించుకోని పంట పండిరచొచ్చన్నారు. మంచి పోషణ చేస్తే, జాగ్రత్తలు వహిస్తే మూడున్నర ఏళ్లు దాటగానే పంట వస్తుందని, పంట ప్రారంభం అయితే.. సంవత్సరం పొడవునా గెలలు వస్తాయని.. నెల వారీగా జీతాలు వచ్చే వారి కన్నా ఆయిల్‌పామ్‌ రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు.రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యపేట జిల్లాల్లో సుమారు 59 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ తోటలు ఉన్నాయని, ఆయిల్‌ పామ్‌ టన్నుకు రూ.22 వేల రూపాయలు ధర రైతుకు వస్తోంది. పెట్టుబడి ఖర్చు పోగా ఎకరానికి రూ.1.50లక్షల వరకు ప్రస్తుతం లాభం వస్తోందన్నారు. కోకో పంటలు అంతర పంటలు వేసుకోవచ్చని, కోళ్లు, పశువులు పెంచొచ్చన్నారు. ఈ పంటల సాగుతో తెలంగాణ రైతాంగంలో కొత్త మార్పులు సంభవిస్తాయన్నారు. యాసంగి పంట లోపల కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుందని, కొత్త పద్ధతులు కొత్త రాష్ట్రంలో అవలంభించాలని, పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ పంటను మూడేళ్లలో వేయాలని, మరో మూడేళ్లలో మరో పది లక్షల ఎకరాల్లో సాగు చేస్తే , మొత్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ పంట వేస్తే.. భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల నుంచి ఆయిల్‌ పామ్‌ పంటను బతిమిలాడి తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు.ఎనిమిదేళ్ల తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తుంటే.. ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు కోతలు విధిస్తున్నారని గుర్తు చేశారు. 20 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయని, ఐదారు లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులు కట్టారా? లేదా ఐదారులక్షల మందికి ఇచ్చేందుకు ఫ్యాక్టరీలు కట్టారా? అని ప్రశ్నించారు. ఇంక ఉన్న ఫ్యాక్టరీలు ఉన్న అంబానీ, అదానీకి అమ్మేస్తున్నారని, రూ.15లక్షల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ యువకులకు 70వేల ఉద్యోగాల వరకు వస్తాయన్నారు. పేటెంట్‌ ముగిసిన బీటీ కాటన్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక్క పత్తి విత్తన ప్యాకెట్‌ విూద రూ.43 పెంచిందని, తెలంగాణలో ఒక కోటి 50 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులు వినియోగిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల భారం రైతులపై వేయడం తగునా? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని, న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామన్నారు. 652 ఎకరాల్లో మల్బరీ తోటలు సిద్ధిపేటలో విస్తరించాయని, ఇందుకు చొరవ చూపిన మంత్రి హరీశ్‌ రావు అభినందనలు తెలిపారు.