ధాన్యం కొనుగోళ్లకు చురుకుగా ఏర్పాట్లు


ప్రభుత్వ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న రైతులు

ఏటా గోనెసంచుల కొరతతో అధికారుల తంటాలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి  రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామంటూ ప్రకటించిన
నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ధాన్యం సేకరణ దిశగా చురుకుగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పాటు, సిఎస్‌ సవిూక్షించిన ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్దం చేశారు. కేంద్రంతో వివాదం ఏర్పడడంతో పాటు కొనుగోళ్ల వ్యవహారమంతా గందరగోళంగా మారడంతో ధాన్యం రైతులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రకటించడమే కాకుండా ఆ దిశగా యంత్రాంగమంతా ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించింది. దీంతో అధికారులు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ మేరకు పలు జిల్లాల్లో కొనుగోలుఏ కేంద్రాలను ప్రారంభించారు. మరోవారం రోజుల్లోగా కోతలు మొదలుకానుండడమే కాకుండా ధాన్యమంతా చేతికి అంద బోతోంది. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ వరికి క్వింటాల్‌కు రూ.1960, బి గ్రేడ్‌ వరికి క్వింటాల్‌కు రూ.1940లను మద్దతు ధరగా ప్రకటించింది.ప్రస్తుతం కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ ఉంచే వ్యవహారం కూడా అధికారులకు కత్తివిూద సాములా మారబోతోందంటున్నారు. కాగా సరిహద్దు రాష్టాల్ర నుంచి అక్రమంగా జిల్లాలోకి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. గోనెసంచుల కిరికిరిప్రతీసారి ధాన్యాన్ని ఉంచేందుకు అవసరమయ్యే గోనే సంచుల కొరత తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. పంట కొనుగోలుకు అనుగుణంగా గోనెసంచులు అందుబాటులో లేకపోతుండడం ఇబ్బందులకు కారణమవుతోంది. కొనుగోళ్ళు ప్రారంభమైన కొద్దిరోజులకే గోనెసంచుల నిల్వలు అయిపోతున్న కారణంగా అధికారులు ఈ సంచుల కోసం నానా తంటాలు పడుతున్నారు. కాగా గోనే సంచులు సైతం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం గోనే సంచుల వినియోగం కూడా తగ్గుముఖం
పట్టడంతో వీటి ఉత్పత్తి పెద్దగా జరగడం లేదంటున్నారు. కేవలం ధాన్యంకోసం మాత్రం గోనె సంచుల అవసరం ఏర్పడుతోంది. అయితే అధికారులు కొనుగోలుకు సంబందించి ఏర్పాట్లలో భాగంగా గోనెసంచుల సేకరణ కోసం కసరత్తు మొదలుపెట్టారు. సమస్యగా మారనున్న గిడ్డంగుల కొరతజిల్లాలో ప్రతీఏటా పంటలను నిల్వ చేసేందుకు అవసరమయ్యే గిడ్డంగుల సౌకర్యం కొరతగా మారుతోంది. పంటల నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా గిడ్డంగులు అందు బాటులో లేకపోతుండడం ఇక్కట్లకు కారణమవు తోందంటు న్నారు. రైతుల నుంచి ధాన్యం కొను గోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అందుకు సన్నద్ధమవుతున్నారు. పూర్తిస్థాయిలో వరికోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఆందోళనలకు దిగడంతో వరి పండిరచిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం మోపుతుండటంతో పంటను ఎలా విక్రయిం చాలో తెలియక అన్నదాతలు మనస్తాపానికి గురయ్యారు. ప్రభుత్వంపై నమ్మకంతో దొడ్డు రకం సాగు చేస్తే, తీరా పంట చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వాలు పేచీలు పెట్టడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొ న్నాయి. మొదటి నుంచి ముడి బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉప్పుడు బియ్యం కూడా కొనాలని కేసీఆర్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ ఎస్‌ నేతలు ఢల్లీిలో ఈ నెల 11న ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రం
నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తామే కొనుగోలు చేస్తామంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.