ALL N EWS

1.అభివృద్ధికి చిరునామా తెలంగాణ
` కేసీఆర్‌ అంటే.. కాల్వలు...చెరువులు, రిజర్వాయర్‌లు
` కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు..
` పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు
` పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు
` బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం
ఖమ్మం,జూన్‌ 11(జనంసాక్షి): దేశంలో అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని, కేసీఆర్‌ అంటే కాల్వలు.. చెరువులు..రిజర్వాయర్‌లని మంత్రి కేటీఆర్‌ అన్నారు.కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. పంచాయితీలు పెట్టుకోవాలని ఏ దేవుడు కూడా చెప్పలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలన్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారని, ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆర్థం చేసుకోవాలన్నారు. చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలని సూచించారు. కరెంట్‌, నీళ్లు లేని గ్రామాల గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలన్నారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంచి పనులు జరిగేటప్పుడు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండా పనులు చేస్తుంటే సహజంగానే కొంత మంది విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి ఒక కార్యక్రమాన్ని ఖమ్మంలో చేపట్టి ఒక నేతను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అంతటితో ఆగకుండా బట్ట కాల్చి విూదేసినట్లు ఆ నేత చావుకు మంత్రి పువ్వాడను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారు.ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదని గుర్తు చేశారు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండేదన్నారు. కానీ 35 ఏండ్ల తర్వాత చూస్తే చైనా 16 ట్రిలియన్‌ డాలర్లతో ముందుకు దూసుకుపోతే. మనం మాత్రం 3 ట్రిలియన్‌ డాలర్లతో వెనుకబడిపోయామన్నారు. పేదల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్నతి, ఎదిగిన దేశాలతోనే మా పోటీ అని చైనా ప్రకటించి, అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా చైనా ఎదిగిందన్నారు. మనకేమో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయింది. పంచాయితీలు పెట్టుకోవాలని ఏ దేవుడు కూడా చెప్పలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

 

బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?
` ఆ పార్టీ నేతలు, వారి బంధువులపై ఎన్నోసార్లు ఈడీ,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి
` మరోమారు ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ కెటిఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. కమలం నేతలంతా సత్య హరిశ్చంద్రులు, వారంతా ఆయన వారసులా అని ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో భాజపా నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలుమార్లు ట్విటర్‌ వేదికగా కేంద్ర సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధాని మోదీ ఇచ్చిన హావిూలపైనా ప్రశ్నించారు. 8 ఏళ్లలో మోదీ సర్కార్‌ ఇచ్చిన హావిూలు.. నెరవేర్చిన వాటి గురించి నిలదీశారు. తాజాగా మరోసారి కమలదళంపై మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.భాజపా నేతలపై ఎన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయని కేటీఆర్‌ ప్రశ్నించారు. వారి బంధువులపై ఎన్నిసార్లు రైడ్స్‌ జరిగాయని అడిగారు. 8 ఏళ్ల పాలనలో ఎంతమందిపై దాడి చేసి.. ఎందరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాషాయ నేతలంతా సత్య హరిశ్చంద్రులు, ఆయన వారసుల్లా ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు. జస్ట్‌ ఆస్కింగ్‌ అనే హాష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌లో ఆయన ప్రశ్నలు సంధించారు.

 

2.దేశసమగ్రతకు విఘాతం కలిగిస్తున్న భాజపా
` రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లేనని..ప్రతీ కార్యకర్త స్పందించాలన్నారు. టీపీసీసీ ముఖ్య నాయకులతో గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. జాతీయ సమగ్రత కోసం యంగ్‌ ఇండియా ట్రస్ట్‌ ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నడుపుతున్నారని చెప్పారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగనప్పటికీ సోనియా, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విచారణ పూర్తయ్యే వరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

3.వచ్చే నెల నుంచి కొత్తపెన్షన్‌లు
` గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చాం.
` కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1450 కోట్లు
` మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు .
కామారెడ్డి ప్రతినిధి జూన్‌11(జనంసాక్షి):వచ్చెనెల నుంచి రాష్ట్రంలో కొత్తపెన్షన్‌లు ప్రారంభమవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు.5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్‌ పెట్‌ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్‌ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్‌, మంత్రులు, స్పీకర్‌ మొక్కలు నాటారు.శనివారం పల్లె ప్రగతి లో భాగంగా గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించారు.గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ పై గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి, సిబ్బంది ని మంత్రి అభినందించారు.అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సవిూక్షించారు.గ్రామంలో ట్రాక్టర్‌ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్‌ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్‌, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ,పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయి అన్నారు.గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకురుతున్నాయి.ఒకప్పటి పట్టణ, నగర వలస తగ్గిపోయి, ఇప్పుడు పల్లెలకు వలస మొదలైందని,గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి.పారిశుద్ధ్యం పెరిగి, ఆరోగ్యం పెరిగి గ్రామాలు ఆయు ఆరోగ్యాలకు అడ్రెస్స్‌ గా మారాయి.ఒక గ్రామానికి పచ్చదనం పెంచడానికి నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.రైతు వేదికలు, కల్లా లు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు.. ఇలా ఇన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదు. సీఎం కెసిఆర్‌ వల్లే ఇది సాధ్యమైంది.రోడ్లు, మురుగు నీటి కాలువలు వచ్చాయి.పైగా ట్రాక్టర్ల ద్వారా ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయి.మొక్కలకు నీళ్ళు పోసే ట్రాక్టర్‌ట్రిప్‌ కు 600 ఇస్తున్నాం అన్నారు.ట్రాక్టర్‌ ద్వారా 1 లక్షా 10 వేలు సంపాదించిన సర్పంచ్‌, కార్యదర్శి లకు అభినందనలు తెలిపారు.కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు 1450 కోట్లు రావాలన్నారు.ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చామని ఆయన ఘంటాపథంగా తెలిపారు.కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా 230 కోట్ల నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని,పేదల ఇంటికి మేనమామ గా కెసిఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, కెసిఆర్‌ కిట్లు ఇస్తున్నాం.సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే అవకాశం త్వరలోనే వస్తుంది.విూ ఎమ్మెల్యే, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విూ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.విూ ప్రాంతం నుంచి అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయ్యాయి.పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీ ల నుంచి ఢల్లీి ని తాకాయి.ఇదంతా సీఎం కెసిఆర్‌ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యం అయింది.ఈ ప్రగతి కొనసాగాలని సీఎం కెసిఆర్‌ కోరుకుంటున్నారు.అందుకు తగ్గట్లు కావాల్సిన నిధులు ఇస్తున్నారు. ఈ నిధులన్నీ గ్రామాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిరది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫెదార్‌ శోభ రాజు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అడిషనల్‌ వెంకటేష్‌ దొత్రె, రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్‌ లు, వార్డు సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు దేశాయ్‌ పేట గ్రామ పల్లె ప్రగతి లో పాల్గొన్నారు.

 

4.విపక్షపార్టీలు.. ఏకం కండి!
` 22 మంది విపక్ష పార్టీల నేతలకు, ముఖ్యమంత్రులకు మమతా బెనర్జీ లేఖలు
` జూన్‌ 15న సంయుక్త భేటీకి ఆహ్వానం
కోల్‌కతా,జూన్‌ 11(జనంసాక్షి): మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం వ్యూహాలు రచించేందుకు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి హాజరుకావాలంటూ ప్రతిపక్ష నేతలకు లేఖలు రాశారు.దిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో జూన్‌ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంయుక్త సమావేశం జరగనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. మొత్తం 22 మంది విపక్ష పార్టీల నేతలకు, ముఖ్యమంత్రులకు దీదీ లేఖలు రాశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రaార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలు, ఇతర విపక్ష నేతలను ఆమె ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు టీఎంసీ తెలిపింది.అటు కాంగ్రెస్‌ కూడా రాష్ట్రపతి ఎన్నికపై వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రతిపక్ష నేతలలో మంతనాలు మొదలుపెట్టారు. డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె మాట్లాడినట్లు తెలిసింది. విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చేలా హస్తం పార్టీ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. 21న ఓట్ల లెక్కింపు చేపట్టనన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగియనుంది. రాష్ట్రపతి రేసులో పలువురు శరద్‌ పవార్‌, నీతీశ్‌ కుమార్‌, ద్రౌపది ముర్ము, ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, తమిళిసై సౌందరరాజన్‌, జగదీశ్‌ ముఖి వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో అధికార భాజపా ఎవరిని నిలబెడుతుందో.. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ఎంపికచేస్తాయో చూడాలి..!

 

 

 

6.బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
` నీటి గుంతలో పడిన స్కార్పియో-` 8 మంది మృతి
పట్నా,జూన్‌ 11(జనంసాక్షి): బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికి తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంగా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి హాజరయ్యారని, కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారును వేగంగా నడపడం, డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడిరచారు.

7.బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు..
` రాంచీ ఉద్రిక్తతల్లో ఇద్దరి మృతి
కోల్‌కతా/రాంచీ,జూన్‌ 11(జనంసాక్షి):మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేలరేగాయి.రaార్ఖండ్‌ రాజధాని రాంచీలో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు నేడు వెల్లడిరచారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో హావ్‌డా జిల్లాలో శనివారం కూడా ఘర్షణలు జరిగాయి.హావ్‌డాలోని పాంచ్లా బజార్‌లో ఈ ఉదయం ఆందోళనకారులు నిరసన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి అల్లరిమూకలు రాళ్లు విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ప్రాంతంలో జూన్‌ 15 వరకు ముగ్గురు కంటే ఎక్కువ గుమిగూడటంపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు.రాంచీలోని హనుమాన్‌ ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జి చేసి రహదారులపై బైఠాయించిన ఆందోళనకారులను తరిమివేశారు. అయితే ఈ ఘర్షణల్లో ఇద్దరు మరణించినట్లు అధికారులు నేడు తెలిపారు. తుపాకీ గాయాల కారణంగా వారు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇక తీవ్రంగా గాయపడినవారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఘర్షణల నేపథ్యంలో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

8.అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తీపికబురు
కరోనా టెస్టు అవసరం లేదన్న బైడెన్‌ సర్కారు
తప్పనిసరి నిబంధన ఎత్తివేత
వాషింగ్టన్‌, జూన్‌ 11(జనంసాక్షి):అమెరికా వెళ్లే ప్రయాణీకులకు బైడెన్‌ సర్కార్‌ తీపి కబురును అందించింది. విమాన ప్రయాణానికి ఒక రోజు ముందు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12:01 గంటల నుంచి అమల్లోకి రానుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ రోచెల్‌ వాలెన్స్కీ వెల్లడిరచారు. ఇందుకోసం సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నాలుగు పేజీల ఆర్డర్‌ను జారీ చేశారు. అక్కడ ఎండాకాలం ప్రారంభం కావడం, ఇప్పటికే కరోనా కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాలు చవిచూడడంతో ఇలాంటి ఆంక్షలు మరోసారి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో తాజాగా ప్రయాణానికి ఒకరోజు ముందు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఈ నిబంధనను తొలగించినా.. 90 రోజులకు ఒకసారి ఈ విషయంలో సవిూక్ష నిర్వహిస్తామని సీడీసీ వెల్లడిరచింది. ఇక సీడీసీ నిర్ణయం అనేది సైన్స్‌, అందుబాటులో ఉన్న డేటాపై ఆధారపడి ఉంటుందని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సెక్రటరీ జేవియర్‌ బెకెర్రా చెప్పారు. యూరప్‌, ఇతర ప్రాంతాలలోని చాలా దేశాలు ఇప్పటికే ప్రయాణానికి ముందు కరోనా టెస్టు చేయించుకోవాలనే షరతును తొలగించాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం కూడా తాజాగా ఈ నిబంధనను సడలించడంపై ప్రయాణీకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బైడెన్‌ సర్కార్‌ తీసుకున్న తాజా నిర్ణయంపట్ల విమానయాన సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం తమకు ఎంతోగాను లబ్ది చేకూరుస్తుందని డెల్టా ఎయిర్‌ లైన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్‌ బాస్టియన్‌, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాబిన్‌ హేస్‌ తెలిపారు. ఇన్నాళ్లు ఈ నిబంధన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.

 

9.ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య
హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఇంట్లోని బాత్‌రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె గదిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చి.. ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. దేశంలో టాప్‌ 30 ఫ్యాషన్‌ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు ప్రత్యూష దుస్తులు డిజైన్‌ చేశారు. దీపికా పదుకొనే, కీర్తి సురేష్‌, శృతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రియ, నిక్కీ గల్రానీ, కృతి కర్భంద, ప్రణీతతో పాటు పలువురు తారలకు డ్రెస్‌లు డిజైన్‌ చేశారు. చాలా మంది సెలబ్రిటీలకు ప్రత్యూష ఎండార్స్‌ చేశారు. దక్షిణ భారతంలోని దాదాపు అందరు హీరోయిన్లకు డ్రెస్‌లు డిజైన్‌ చేశారు. అయితే, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొంతకాలంగా ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

10.దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
` వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
కొల్లాపూర్‌,జూన్‌ 11(జనంసాక్షి):దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో 25 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పద్మావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు చ్చిందని, దళితబంధు తీసుకునేవారంతా లబ్ధిదారులు కాదు.. హక్కుదారులన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్‌లో ప్రజల్లో ఈ పథకం కీలక డిమాండ్‌ ఉంటుందన్నారు.సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ దళితబంధు ఇతర రాష్ట్రాల్లో ఆశాజనకంగా డిమాండ్‌గా ఉంటుందని, దళితబంధు పథకం లబ్ధిదారులు పట్టుదలతో కష్టపడి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు. అనంతరం మాధవవస్వామి ఆలయ ఆవరణలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పెంట్లవల్లిలో నమాజ్‌ కట్ట ఆధునికీకరణలో భాగంగా రోడ్డు వెడెల్పు, మినీ ట్యాంక్‌ బ్రిడ్జి కోసం రూ.3కోట్లతో భూమిపూజ చేశారు.

11.మేం ముందే హెచ్చరించాం.. జెలెన్‌స్కీనే వినలేదు..!
`అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
వాషింగ్టన్‌,జూన్‌ 11(జనంసాక్షి): రష్యా చేస్తోన్న దురాక్రమణ ఉక్రెయిన్‌కు తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను తెచ్చిపెడుతోంది. అయితే.. అసలు ఈ దాడి గురించి అమెరికా చేసిన ముందస్తు హెచ్చరికలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వినడానికి ఇష్టపడలేదట.ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడిరచారు. లాస్‌ఏంజెల్స్‌లో నిధుల సవిూకరణ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలలనాటి పరిణామాలను వివరించారు.’రష్యా దాడి గురించి నేను ముందస్తుగా చేసిన హెచ్చరికలను అతిశయోక్తిగా చేసిన ప్రకటన అని చాలామంది భావించారు. అది నాకు తెలుసు. కానీ మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడిరచాం. ఆయన (పుతిన్‌ను ఉద్దేశించి) సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే జెలెన్‌స్కీ ఈ విషయాన్ని వినేందుకు ఇష్టపడలేదు. ఇంకా చాలామంది వినలేదు. వారు ఎందుకు వినకూడదనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు’ అంటూ బైడెన్‌ వెల్లడిరచారు.ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించకముందే.. రష్యా సైనిక సన్నద్ధతపై అమెరికా హెచ్చరికలు చేసింది. తేదీతో సహా యుద్ధం ప్రారంభమయ్యే రోజును పేర్కొంది. కాకపోతే తేదీలో మార్పు జరిగినా..అంచనా వేసినట్టుగానే పుతిన్‌ సేనలు దురాక్రమణకు దిగాయి. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్రదేశాలు కూడా కొన్ని నమ్మలేదు. అమెరికా మరీ ఎక్కువ ముందు జాగ్రత్త పడుతోందని అంతా భావించారు.

12.కేటీఆర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు..!
` బండి సంజయ్‌ను ఆదేశించిన రెండో అదనపు న్యాయస్థానం
హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం చీఫ్‌ జడ్జి ప్రభాకర్‌రావు శుక్రవారం ఆదేశించారు.కేటీఆర్‌ను కించపరిచేలా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో, పబ్లిక్‌ లేదా ప్రైవేటు వేదికలు, సామాజిక మాధ్యమాలు, సమావేశాలు, ముఖాముఖిల్లో మాట్లాడటం కాని, ప్రచురించడం కాని చేయొద్దంటూ బండి సంజయ్‌తో పాటు ఆయన అనుచరులను ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో మే 11న ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఆరోపణలు చేయగా.. ఆధారాలు చూపించాలని.. 48 గంటల్లో స్పందించకపోతే పరువునష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు.ఈ నేపథ్యంలో మే 13న మంత్రి కేటీఆర్‌ తరఫున ఆయన న్యాయవాది బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంలో దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌ పేరు ఆపాదించే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్‌ తరఫు న్యాయవాది మోహిత్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.

13.తెలంగాణ,ఏపీలో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు
` భారత వాతావరణ విభాగం వెల్లడి
న్యూఢల్లీి,జూన్‌ 11(జనంసాక్షి):ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాల్సిన రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది.ప్రస్తుతం కర్ణాటకతో పాటు కొంకణ్‌, గోవా తదితర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వెల్లడిరచింది.ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర కొనదాహాను, పుణె, బెంగళూరు, పుదుచ్చేరిపై ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. రాగల 48 గంటల్లో కొంకణ్‌ సహా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. తెలంగాణ, ఏపీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ వెల్లడిరచింది. మరోవైపు ఉత్తర భారత్‌కూ వేగంగా విస్తరించేలా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తరకోస్తాంధ్ర విూదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి స్వల్పంగా బలహీనపడనుందని స్పష్టం చేసింది. కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అదనంగా నమోదు అయినట్టు వెల్లడిరచింది. రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది.

14.మరోసారి సత్తాచాటిన
నిఖత్‌ జరీన్‌
` కామన్‌వెల్త్‌ క్రీడలకు బెర్త్‌ ఖాయంచేసుకున్న తెలంగాణ బాక్సర్‌
` అర్హత పోటీల్లో ఘన విజయం

 

16.ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 8 మంది సజీవ దహనం
నయాగఢ్‌, జూన్‌ 11(జనంసాక్షి):ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నయాగఢ్‌ జిల్లాలో బడాపాండుసర్‌ లో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. వంతెనపై ప్రయాణిస్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. వెంటనే ట్యాంకర్‌ వంతెనపై నుంచి కింద పడిరది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.