1.మొదలైన ఫోర్త్‌వేవ్
` జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఉండొచ్చని అంచనా
` ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల వెల్లడి
` దేశంలో ఆగని కొవిడ్ ఉద్ధృతి..
` ముంబైలో వెయ్యిశాతం పెరుగుదల..!
దిల్లీ,జూన్ 13(జనంసాక్షి): దేశంలో కొవిడ్ కేసుల గ్రాఫ్ మళ్లీ పైకి ఎగబాకుతోంది. జనవరి తర్వాత గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,084 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కేవలం వారంలోనే దాదాపు 50వేల కొత్త కేసులు నమోదవ్వడం.. రోజురోజుకీ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఇది నాలుగో వేవ్కు సంకేతమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్త్ వేవ్పై ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వేసిన అంచనా తాజాగా చర్చనీయాంశంగా మారింది.జూన్లో కరోనా నాలుగో వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్వేవ్ ప్రభావం ఉండొచ్చని అప్పట్లో అంచనా వేశారు. ఈ దశ తీవ్రత ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్, బూస్టర్ డోసుల ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీప్రింట్ సర్వర్ ఓవటఖీలీతిలలో ప్రచురితమైంది. ఫోర్త్వేవ్ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని.. ఆగస్టు 15 నుంచి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకొని ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. గత మూడు వేవ్ల సమయాల్లో నమోదైన కరోనా కేసులు, పీక్ టైమ్, మరణాల సంఖ్యలో ఈ పరిశోధకులు వేసిన అంచనాలు దాదాపు నిజం కావడంతో తాజా ప్రిడెక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, మన దేశంలో ప్రస్తుతం ఆందోళన కలిగించే కొత్త వేరియంట్ ఏదీ లేదని, తాత్కాలికంగా కేసులు పెరిగినా ఫోర్త్వేవ్కు ఛాన్స్ లేకపోవచ్చని పేర్కొంటున్నారు కొందరు ఆరోగ్యరంగ నిపుణులు. వేసవి సెలవుల్లో ప్రజల కదలికలు పెరగడం, దేశీయ/అంర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల సడలింపు, కొందరు బూస్టర్ డోసులు తీసుకోకపోవడంతో పాటు కొవిడ్ నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే కేసులు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. తాజాగా కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు స్వల్పమేనని, ఎవరూ దీనిపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. అయితే, భారీగా టెస్టులు చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలను మాత్రం తప్పకుండా పాటించడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని కట్టడి చేయవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ఏది ఏమైనా తాజాగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే వ్యాప్తిని అడ్డుకోగలమని పలువురు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ పేర్కొన్న గణాంకాల ప్రకారం.. దేశంలో తాజాగా నమోదైన కొత్త కేసులతో ఇప్పటివరకూ కొవిడ్ సోకినవారి సంఖ్య 4,32,30,101కు చేరింది. వీరిలో 4,26,57,335 మంది కోలుకోగా.. 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 47,995గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.21శాతంగా ఉంది. రికవరీ రేటు 98.68శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.21శాతంగా ఉందని ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.మన దేశంలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పట్నుంచి 2020 ఆగస్టు 7నాటికి కేసుల సంఖ్య 20లక్షల మార్కును దాటగా.. ఆగస్టు 23న 30లక్షలు, సెప్టెంబర్ 5న 40లక్షలు, సెప్టెంబర్ 16న 50లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత 60లక్షల మార్కును సెప్టెంబర్ 28న దాటగా.. 70లక్షల మార్కును అక్టోబర్ 11న, 80లక్షల మార్కును అక్టోబర్ 29న, 90లక్షల మార్కును నవంబర్ 20న, కోటి కేసుల మార్కును డిసెంబర్ 19న క్రాస్ చేసింది. ఆ తర్వాత రెండు కోట్ల మార్కును 2021 మే నెలలో చేరగా.. మూడు కోట్ల మార్కును జూన్ 23న దాటింది.
ముంబైలో వెయ్యిశాతం పెరుగుదల..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. రెండేళ్లు గడిచినా మహమ్మారికి అంతమెప్పుడో నిపుణులే చెప్పలేని పరిస్థితి. గతవారం పది రోజులుగా దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 3న వరకు రోజుకు 3వేలకుపైగా కొత్త కేసులు నమోదైతే.. 11వ తేదీ నాటికి 8వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 8వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 45వేలకు చేరువయ్యాయి. వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.అయితే, దేశంలో వేసవి సెలవుల కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలు సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా పేర్కొంటున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం చాలా వరకు కేసుల పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, ఈ ఇది కాస్త ఊరట కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రత్యేక నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చాలా వేగంగా దిగజారుతోంది. మే 17 నుంచి ముంబైలో రోజువారీ కేసుల్లో దాదాపు వెయ్యిశాతం పెరుగుదల నమోదైంది. 17న ఆ రాష్ట్రంలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 11 నాటికి 1745కు చేరాయి. పశ్చిమ బెంగాల్‌లోనూ 30శాతం రోజువారీ కేసులు పెరిగాయి.భారత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4, బీఏ.5 కేసులు నమోదవుతున్నాయి. గత పది రోజుల్లో పలువురు ఈ వేరియంట్ల బారినపడ్డారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అధిక ఇన్ఫెక్టివిటీ రేటు కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ సబ్ వేరియంట్లను గుర్తించారు. ఈ రెండిరటిని నిపుణులు ర్యాపిడ్ స్ప్రెడర్లుగా వర్ణించారు. భారత్‌కు ముందు దక్షిణాఫ్రికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీటి కారణంగా చాలా దేశాల్లో కేసులు భారీగా పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మారియా వాన్‌కెర్‌ఖోవ్ బీఏ.4, బీఏ5 సబ్ వేరియంట్లు కొన్ని ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో ఇన్‌ఫెక్టివిటీ రేటును గణనీయంగా పెంచుతాయని పేర్కొన్నారు. టీకాలతో లభించే రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని వేరియంట్లు తప్పించుకుంటాయని పేర్కొన్నారు.శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఈ వేరియంట్లు అధిగమిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం వైరస్ నుంచి ముప్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ల నేపథ్యంలో బూస్టర్ డోస్ ఎంత మేరకు ప్రభావం ఉంటుందనే విషయంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నా తీవ్రమైన ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
(కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు
రాష్టాల్రను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ )
న్యూఢల్లీి,జూన్ 13(జనంసాక్షి):కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్టాల్రఆరోగ్యమంత్రులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్ వేయాలని సూచించారు. దీంతో పాటు జోనోమ్ సీక్వెన్సింగ్ ను బలోపేతం చేయాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యమన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ మెంట్ తో పాటు టీకాలు వేయడం కోవిడ్ నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రత్యేక డ్రైవ్ ను సవిూక్షించాలని అన్ని రాష్టాల్ర ఆరోగ్యమంత్రులను ఆదేశించారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు రెండు డోసుల టీకాలు వేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని మన్?సుఖ్ మాండవీయ అన్నారు. టీకా రక్షణతో పిల్లలు పాఠశాలలకు హాజరుకావొచ్చని చెప్పారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 8వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢల్లీి వంటి రాష్టాల్లో కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి రాష్టాల్రను అప్రమత్తం చేశారు.
(18ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్
ఉచితంగా ఇవ్వాలన్న మంత్రి హరీష్ రావు)
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి): ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సవిూక్షలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్టీయ్ర నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్`2.0పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో దృశ్యమాద్యమ సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, పలు విభాగాల అధికారులు సవిూక్షలో పాల్గొన్నారు.‘తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 32 లక్షల కొవిడ్ టీకా డోసులున్నాయి. వాటి ముగింపు తేదీ దగ్గర్లోనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మందికి టీకా అందించాం. 12 ఏళ్లు పైబడిన వారికి.. మొదటి డోసు 104.78 శాతం, రెండో డోసు 99.72 శాతం పంపిణీ చేశామని హరీశ్ రావు తెలిపారు.
2.ఆటో మొబైల్ రంగంలో అపార అవకాశాలు
` కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను ప్రారంభించిన కేటీఆర్
` అన్నిరంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని వ్యాఖ్య
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి):ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా`ఈని ప్రారంభించబోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చెన్నై, బెంగుళూర్, ముంబై నగరాలంటే ఇష్టం... కానీ హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందలన్నదే తన ధ్యేయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా తర్వాత అతిపెద్ద గ్లోబల్ సెంటర్‌గా హైదరాబాద్‌ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ లో మొదటి ఆటో మొబైల్ సంస్థ అని, ఇప్పటికే గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్ లాంటివి హైదరాబాద్ లో తమ అతిపెద్ద సెంటర్లని స్థాపించాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి సరసన అడ్వాన్స్ ఆటో పార్ట్స్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆటోమేటీవ్ రంగానికి హైదరాబాద్ లో మంచి భవిష్యత్ ఉందన్న ఆయన.. ఈవీ పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ టెక్నాలజీ హబ్ గా మారిపోయిందని, అమెరికన్ సంస్థలు పోటీ పడి మరీ హైదరాబాద్ కి వస్తున్నాయని, ఫార్ములా`ఈ రేస్ ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
(దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వం
కేంద్రం తీరుపై మరోమారు కెటిఆర్ విమర్శలు)
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి):దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని, డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్టాన్రికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ గణాంకాలు 2021, అక్టోబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలోనివే అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
3.రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
` గంటల తరబడి విచారణ
` రెండుపూటలా హాజరైన కాంగ్రెస్‌అగ్రనేత
` కార్యాలయానికి రాహుల్‌తో పాటు ప్రియాంకరాక
` మధ్యలో గంగారామ్ ఆస్పత్రికి వెళ్ల సోనియాకు పరామర్శ
` కాంగ్రెస్ కార్యాలయలంలో సీనియర్ నేతల భేటీ
న్యూఢల్లీి,జూన్ 13(జనంసాక్షి):రాహుల్‌కు ఇడి సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.పలు రాష్టాల్ల్రో కాంగ్రెస్ ర్యాలీలు తీసి మోడీకి వ్యతిరేకంగగా నినాదాలు చేశారు. ఢల్లీిలోనూ ఎఐసిసి కార్యాలయం నుంచి ఇడి కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీసారు. ఉదయం 3 గంటల పాటు రాహుల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ స్టేట్‌మెంట్ ఈడీ రికార్డ్ చేసింది. రాహుల్‌కు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లు ఈడీ వర్గాల వెల్లడిరచాయి. సోమవారం ఉదయం 11:30 నుంచి రాహుల్‌ను ఈడీ విచారించింది. ఉదయం ఈడీ విచారణ కాగానే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీతో కలిసి గంగారామ్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియాను కలిసేందుకు రాహుల్ అక్కడికి వెళ్లారు. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రిలో చేరారు. ఆమెను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మరోమారు ఈడీ ఎదుట హాజరయ్యారు. రాహుల్‌గాంధీపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అసోసియేట్ జనరల్ సంస్థలో విూ హోదా ఏమిటని ఈడీ ప్రశ్నించింది. యంగ్ ఇండియన్ సంస్థతో విూకున్న సంబంధం ఏమిటి? విూ పేరుతో ఆ సంస్థలో ఎందుకు షేర్లు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకిచ్చారని రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది.
(దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
ఢల్లీిలో ఈడీ ఆఫీస్ ముందు బైఠాయించిన నేతల అరెస్ట్
గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోన్న బిజెపి
భాజపా బెదిరింపులకు భయపడేది లేదు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
ఈడీ కేసుల తీరుపై మండిపడ్డ భట్టి,రేవంత్)
న్యూఢల్లీి/హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి):నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్దకు రాహుల్‌కు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు. అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఈడీ ఆఫీస్‌కు చేరుకునే అన్ని రోడ్ల దగ్గర బారికేడ్లు, ఢల్లీి సీనియర్ పోలీసు అధికారులు కూడా రంగంలోకి దిగారు. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతల ట్వీట్లు, అదే ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతల కౌంటర్లు ఇచ్చారు. ఢల్లీిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు.. రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రెస్‌విూట్ పెట్టింది. కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలుపుతోందని, ఇంతమంది పోలీసులను మోహరించడం చూస్తుంటే కాంగ్రెస్‌కు మోదీ ప్రభుత్వం ఎంత భయపడుతుందో తెలుస్తోందని రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యలు చేశారు.రాహుల్‌ను ఈడీ నోటీసులు, విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు దిగింది. ఢల్లీిలో జరిగిన సత్యాగ్రహ మార్చ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు. రాహుల్‌పై అన్నీ నిరాధార ఆరోపణలేనని.. సత్యమే గెలుస్తుందని రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో రాహుల్, ప్రియాంక భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చిన నేతలను, కార్యకర్తలను కలుసుకున్న రాహుల్.. ఆ తర్వాత అక్కడి నుంచి ఈడీ ఆఫీస్‌కు ప్రియాంకతో కలిసి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి సవిూపంలో నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రజ్ని పాటిల్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఎల్.హనుమంతయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్, కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. రాహుల్‌ను విచారించిన ముగ్గురు ఈడీ అధికారులు.. అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంకు అధికారి రాహుల్‌ను ప్రశ్నించగా మరో అధికారి రాహుల్ స్టేట్‌మెంట్‌ను టైప్ చేసి రికార్డ్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ర్యాంకు అధికారి విచారణను పర్యవేక్షించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు దాదాపు 3 గంటల పాటు విచారించింది. దిల్లీలో అప్రకటిత ఎమ్జ్గంªన్సీ విధించిందని మోదీ సర్కారుపై కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. గాడ్సే వారసులు.. గాంధీ వారసత్వాన్ని సవాల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు మోదీ ప్రభుత్వం భయపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సత్యం కోసం పోరాడుతోందని, దీన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈడీ అడిగే ప్రశ్నలన్నింటికీ ఎన్నికల్లో సమాధానం చెబుతామని అన్నారు. పార్టీ సీనియర్ నేతలు రాహుల్‌కు సంఫీుభావంగా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈడీ కేసుల తీరుపై మండిపడ్డ భట్టి,రేవంత్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని, బిజెపి బెదిరింపులకు భయపడేది లేదని సీఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం జోలికి వస్తే బీజేపీని తరిమికొడతామని భట్టి హెచ్చరించారు.ఇది అంతంకాదు..ఆరంభం మాత్రమేనని, ఎన్ని పోరాటాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందన్నారు. రాహుల్, సోనియాలపై ఈ వాలనివ్వమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భాజపా తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే భాజపా కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్... భాజపాపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఎఫ్‌ఐఆర్ నమోదు లేకుండానే సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని.. మండిపడ్డారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తప్పు చేసిందంటే ప్రజలు నమ్మరని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీని 1979లో జైలుకు పంపిస్తే దేశం మొత్తం మద్దతుగా నిలిచి 1980లో కాంగ్రెస్‌ను గెలిపించారని వివరించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతుందన్నారు. ఈడీ, సీబీఐలు గాంధీ కుటుంబాన్ని ఏం చేయలేవన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేవని తేల్చిందని... దానితో పాటు 2017లో ఈడీ కూడా అవకతవకలు లేవని తేల్చిందని తెలిపారు. 1937లో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. సర్దార్ పటేల్ కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏర్పాటులో భాగం పంచుకున్నారు. స్వాంతంత్రో ద్యమంలో ప్రజల్లో ఐక్యత పెంచేందుకే నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. నెహ్రూ కుటుంబం ఎన్నో నష్టాలకు ఓర్చి నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించింది. పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు ఇచ్చి ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు నేషనల్ హెరాల్డ్ పత్రికపై కేసు వేయించారు. నేషనల్ హెరాల్డ్‌లో ఎలాంటి నగదు బదిలీ జరగలేదని ఈడీ 2017లోనే తేల్చింది. భాజపా పాలనలో పేదల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మోదీ సర్కార్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడాలంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా.. ప్రజల కోసం త్యాగం చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీకి డబ్బే కావాలంటే .. దేశ కాంగ్రెస్ కార్యకర్తలే చందాలేసుకుని గాంధీ కుటుంబాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజంగానే గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరంలేదని.. ప్రజాసేవనే వారు కోరుకునేదన్నారు. రాహుల్ కు 50లక్షలు కాదు..5వేల కోట్లు కావాలన్నా 24గంటల్లో కాంగ్రెస్ అభిమానులు ఇవ్వగలరని.. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కరలేదన్నారు. అన్ని రాష్టాల్రలోను ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నామని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయాంలో విఫరీతంగా ధరలు పెరుగుతున్నాయని, పెట్రో మంట, గ్యాస్ గుబులు, నిత్యావసర ధరలు చెప్పుకుంటూ పోతే అన్నీ పెరుగుతూ వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 977లో ఇందిరా గాంధీని అవమానిస్తే ..1980లో జరిగిన ఎన్నికలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. ఇవాళ తేదీ గుర్తుపెట్టుకోవాలని 13`జూన్`2022న రాహుల్ గాంధీని అవమానించారని , ఇందుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో సమాదానం చెబుతారని చెప్పారు. 1980లో కూడా ఇందిరా గాంధీపై కేసు పెడితే.. తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలొకి వచ్చిందని.. జూన్ 23న సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోడీ పునాదులు కదుల్తాయ్ అన్నారు. గాంధీ కుటుంబం విూద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరని.. తెలంగాణ కళ సాకారం చేసిన దేవత సోనియా అన్నారు. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలుస్తే ఉరుకుంటామా.. గాంధీ వారసులం కాబట్టి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ కు సానుభూతి పెరుగుతుందని, అధికారంలోని వచ్చాక ఎవ్వరినీ వదలమన్నారు. సోనియాగాంధీని అవమానించిన వారికి తగిన బద్ది చెబుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
విశాఖ ఇడి కార్యాలయం ముందు ధర్నా
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండిరచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కుటిల రాజకీయాలు చేస్తోందని..ఇలాంటి చర్యలను ఆపకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విచారణను ఖండిరచిన కాంగ్రెస్ నేతలు.. పలుచోట్ల నిరసన ప్రదర్శనలకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారించడాన్ని నిరసిస్తూ.. విశాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కార్యాలయం వద్ద.. కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్‌పై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ªపంటూరు: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండిరచారు. గుంటూరులోని పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తోందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. ఎప్పుడో ముగిసిన కేసులో ఇప్పుడు ఈడీ చేత నోటీసులు ఇప్పించటం సరికాదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కుటిల రాజకీయాలు చేస్తోందని.. ఇలాంటి చర్యలను ఆపకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు.వైఎస్సార్? జిల్లా: నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ సమన్లు పంపించడాన్ని ఖండిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు కడప కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
4.గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత
` ట్రయల్ రన్‌కుముందుగా వందమంది అరెస్ట్
సిద్దిపేట,జూన్ 13(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు భూనిర్వాసితులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరిహారం చెల్లించకుండా ట్రయల్‌రన్ ఎలా చేస్తారంటూ భూ నిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్ రన్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సుమారు 100 మంది భూనిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామంలో కెనాల్ కాలువ కోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంపు నీటిని విడుదల చేసి.. ఆ నీటిని ఈ కెనాల్ ద్వారా కుడి, ఎడమ కాలువలకు అనుసంధానం చేసి సాగునీరు విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విూడియాను గ్రామంలోకి అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, అధికారులు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించాలి కానీ.. అర్ధరాత్రి వేళ పోలీసులతో దౌర్జన్యంగా తమ ఇళ్లపై దాడి చేయించడం ఏంటని భూ నిర్వాసితులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆడ`మగ అని తేడా లేకుండా కొట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. నిర్వాసితుల కాళ్లు, చేతులు విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు. తలలు పగుల గొట్టారన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్? చేశారు. నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని సూచించారు.సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదెక్కి దౌర్జన్యమని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండిరచారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు. రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చేయలేదేమో... ఇకనైనా కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పాలించడం మానుకోవాలని హితవుపలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడు తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండిరచారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతు న్నాయి. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి ` గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
5.స్వదేశీ హైపర్‌సోనిక్ మిస్సైల్ తయారీ
న్యూఢల్లీి,జూన్ 13(జనంసాక్షి):స్వదేశీ హైపర్‌సోనిక్ మిస్సైల్ తయారీలో నిమగ్నమైనట్లు ఇండియా, రష్యా డిఫెన్స్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ వెల్లడిరచింది. రానున్న 5, 6 ఏళ్లల్లో హైపర్‌సోనిక్ మిస్సైల్ ను ఇండియా తయారు చేస్తోందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో అతుల్ రాణెళి చెప్పారు. హైపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసే సామర్థ్యం బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కి ఉందని, రాబోయే ఆరేళ్లలో తొలి హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను స్వదేశీయంగా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా అయిదు రేట్ల అధికంగా వెళ్లడం, లేదా మాక్ 5 స్టేజ్‌ను చేరుకోవడం హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రత్యేకత.
6.తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి): తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతపవనాల రాకతో వాతావరణం చల్లబడిరది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ప్రకటించారు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు.
7.సిగరెట్ తాగారో చస్తారు
` ప్రతీ సిగరెట్‌పైనా హెచ్చరిక
` కెనడా నిర్ణయం
న్యూఢల్లీి,జూన్ 13(జనంసాక్షి):సిగరెట్ బాక్సుల విూద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం.ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్ ఉత్పత్తుల పై గ్రాఫిక్ ఫోటోతో కూడిన వార్నింగ్ సందేశాలు ఉండేవి. సిగరెట్ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ.ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు.ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్‌లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
9.అన్నదాతలకు అండగా వ్యవసాయ విధానాలు
పెరుగుతున్న దిగుబడులే నిదర్శనం
అన్నదాతల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేవన్న నిరంజన్ రెడ్డి
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి): తెలంణ వ్యవసాయం గాడిన పడుతోంది. అన్నదాతకు అన్ని విధాలుగా అండ దొరికిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. సిఎం కెసిఆర్ ఒక్కో నిర్ణయం వారిని ముందుకు నడిపించేదిగా ఉంటోంది. తెలంగాణ దేశానికి రైస్‌బౌల్‌గా మారిందని ఇటీవలే సిఎం కెసిఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇంకా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మృగశిర ప్రవేశించి మళ్లీ నాట్లు వసేందుకు సిద్దం అవుతున్న వేళ ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. అయితే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగినా ఇంకా ధాన్యం వస్తూనే ఉంది. ఇదంతా కూడా పెరిగిన ధాన్యం దిగబడులకు నిదర్శనంగా చూడాలి. వ్యవసాయాభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. రైతువేదికలు, కల్లాల నిర్మాణం, రైతుబంధు, రైతులకు బీమా, ఉచిత విద్యుత్ వంటి చర్యలు ధాన్యం దిగుబడులకు నిదర్శనంగా చూడాలి. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా రైతులకు కల్లాలను కట్టి ఇవ్వాలని చూస్తున్నది. ధాన్యం చేతికొచ్చే సమయంలో కల్లాలను పొలంలోనే ఏర్పాటు చేస్తారు. అయితే అలా కాకుండా రైతులకు సమిష్టిగా ఉపయోగపడేలా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందుబాటులో కల్లాలను కట్టబోతున్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టు కునేందుకు పల్లెల్లో కల్లాలు ఏర్పాటు వల్ల కూడా కలసి వస్తోంది. ఉపాధిహావిూ పథకం కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో లక్ష కల్లాలు నిర్మించడంపై దృష్టి సారించారు. సిఎం కెసిఆర్ ముందుచూపు, రైతుల పట్ల ఉన్న ప్రేమ, వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణ రైతాంగానికి మంచిరోజులొచ్చాయి. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికి ఆదర్శంగా మారుతున్నది. ఇప్పటికే రైతులకోసం పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం రైతు పండిరచిన పంటకు మద్దతు ధర దక్కేందుకు వీలుగా వ్యవసాయ విధానాన్ని రూపొందిం చింది. వ్యవసాయంలో లాభాలు రావాలంటే ప్రధానంగా కరెంట్, నీళ్ళు, రైతుకు దన్నుగా నిలువడం, వారిలో మేమున్నామనే ధైర్యాన్ని వ్వడం అవసరం. రైతుబంధు ఓ చారిత్రాత్మక నిర్ణయం. రైతుబీమా, రైతుబంధు సమితుల ఏర్పాటు వంటివి రైతులకు ఎంతో విశ్వాసాన్ని, బలాన్ని కల్పించేవే. ఇన్ని చేసినా ఇటీవల ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రభుత్వమే రైతు పండిరచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనంగా చూడాలని వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి పదేపదే చెప్పారు. ఇన్నాళ్లుగా తీసుకున్న సానుకూల నిర్ణయాలతో ఈసారి రికార్డుస్థాయిలో వరి ధాన్యం పండిరది. దేశానికే అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరింది. ఇకపోతే సాగునీటి రంగంలో కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును చేపట్టారు. అతికొద్ది కాలంలోనే దాన్ని పూర్తిచేసి తెలంగాణను జల భాండాగారంగా మార్చారు. ఎక్కడి గోదావరి.. ఎక్కడి కొండపోచమ్మ సాగర్! కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి నీళ్ళను ఎదురెక్కించడం అరుదైన ఇంజనీరింగ్ ప్రతిభగా చెప్పుకోవాలని నిరంజన్ రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. కాళేశ్వరం నీళ్ళు చెరువుల్లో నింపుతున్నారు. ఈ వర్షకాలంలో మరిన్ని నీళ్లు ఎదురెక్కే అవకాశం రాబోతోంది. అయితే పండిరచిన పంటలకు ప్రబుత్వమే జవాబుదారీగా ఉంటే మరీ మంచిది. అందరూ ఒకే పంట వేయడంతో డిమాండ్ లేక పంటకు సరైన ధర రాదు. రైతు తన భూమిలో వివిధ రకాల పంటలు వేసినట్లయితే డిమాండ్ పెరిగి ధరకూడా ఎక్కువ వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. పంటమార్పిడి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసేందుకు ముఖ్యమంత్రి పటిష్ఠ ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయం ప్రధానమైన తెలంగాణలో వలసలు లేని జిల్లాలు ఉండాలన్న ఆలోచనలో సిఎం కెసిఆర్ ఉన్నారిన అన్నారు. ఇక్కడి వారు ఇక్కడే ఉండి కూలీ చేసుకోవాలని, గల్ఫ్ దేశాలకు వలస పోవద్దని పలుమార్లు అన్నారు. ఇవ్వాళ వ్యవసాయం కేంద్రంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది.కెసిఆర్ నేతృత్వంలో ఆదర్శ వంతమైన వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణను ఒక అద్భుతమైన, మొదటి వరుసలో నిలబెట్టే ప్రయత్నం కొనసాగుతున్నది. రైతుకు అండగా రాష్ట్రస్థాయి వరకు అనేక రకాలుగా రైతులకు భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టారు. రైతుకు అండగా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి రైతుబంధు సమితులు, వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు పని చేస్తున్నారు. సాగునీరు, నకిలీ విత్తనాల, మందుల బెడద లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
10.కేసీఆర్ ఒక్కడే భాజపాను ఎదుర్కోగలడు
` దేశ రాజకీయాలపై ఆయనకు బాగా అవగాహన ఉంది
` కేసీఆర్ మంచి కమ్యూనికేటర్
` మరోమారు కలసి రాజకీయాలపై చర్చిస్తా
` దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం తీసుకు రావాల్సందే
` మోడీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోంది
` ఉండవల్లి అరుణ్ కుమార్
విజయవాడ,జూన్ 13(జనంసాక్షి): దేశ రాజకీయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వ్యతిరేకులను ఏకంచేసే శక