1.మసీదులను తవ్వడం కాదు..(కి
ప్రాజెక్టుల పునాదులను తవ్వండి
` బండి సంజయ్‌కు కేటీఆర్ చురక
` తెలంగాణపై కొనసాగుతున్న కేంద్రం వివక్ష
` నిధుల విడుదలలో తీవ్రనిర్లక్ష్యం
` నేను చెప్పే మాటలు అబద్ధమైతే రాజీనామాకు సిద్ధం
` బీజేపీ చెప్పింది తప్పైతే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా?
` అమిస్తాపూర్ బహిరంగ సభలో మంత్రి సవాల్
హైదరాబాద్,జూన్ 4(జనంసాక్షి): భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఎంపీగా గెలిచి అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా ప్రజల మధ్య విద్శేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నాడని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మసీదులను తవ్వడంకాదు.. ప్రాజెక్టుల పునాదులను తవ్వాలని హితవు పలికారు.తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేవరకద్ర మండలం వెంకపల్లి లో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. అమిస్తాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి తెలంగాణ రూ.3.65లక్షల కోట్లు ఇస్తే.. రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను చెప్పింది నిరూపి స్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్.. బీజేపీ చెప్పింది తప్పయితే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. పాలమూరు` రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఎనిమిదేళ్లలో ఒక్క పైసా ఇవ్వలే దని.. వికారాబాద్, కర్నాటక, గద్వాల`మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కృష్ణానదిలో తెలంగాణకు 575 టీఎంసీల నీటివాటా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. పాలమూరులో 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే నని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో వలసలు తగ్గాయని గుర్తు చేశారు. మంచి మంచి సంక్షేమ పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా ఉన్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం తో కొట్లాడి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిధులు తీసుకొచ్చారని, నియోజకవర్గంలో వెంకటేశ్వర్‌రెడ్డి 21 చెక్‌డ్యాంలు కట్టించార న్నారు. కొత్తకోట మున్సిపాలిటీకి త్వరలో రూ.4 కోట్లు మంజూరు చేస్తామన్నారు. దేవరకద్రను మున్సిపా లిటీ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్లలెటూర్లకు అపార్ట్‌మెంట్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే తమ పార్టీ ధ్యేయ మన్నారు. ఈ ఏడాది నుంచే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, 3వేల మందికి.. 3లక్షలు అందించ నున్నట్లు కేటీఆర్ వివరించారు.. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.119 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని తెలిపారు.
2.ధరల పెంచి ఈపీఎఫ్ వడ్డీ తగ్గిస్తారా..!
` ఇదేంన్యాయం!
` రాహుల్ విమర్శలు
` చిరునామాలో లోక్ కళ్యాణ్ ఉంటే సరిపోదంటూ ట్వీట్
న్యూఢల్లీి,జూన్ 4(జనంసాక్షి):చిరునామాలో ప్రజా సంక్షేమాన్ని పెట్టుకున్నంత మాత్రానికి సరిపోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో శనివారం గాంధీ ఓ ట్వీట్ చేశారు. 2021`22 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. నివసించే ఇంటి చిరునామాలో ‘లోక్ కల్యాణ్ మార్గ్‘ అని పెట్టుకున్నంత మాత్రానికి ప్రజలకు సంక్షేమం జరగదని హితవు పలికారు. ‘ఇంటి చిరునామాను ’లోక్ కల్యాణ్ మార్గ్’ అని పెట్టుకోవడం ప్రజలకు సంక్షేమాన్ని తీసుకురాదు. 6.5 కోట్ల మంది ఉద్యోగుల వర్తమానం, భవిష్యత్తును నాశనం చేయడానికి ’ద్రవ్యోల్బణం పెంపు, ఆదాయం తగ్గింపు’ విధానాన్ని ప్రధాన మంత్రి అమలు చేస్తున్నారు‘ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి (ఇఖఈ) డిపాజిట్లపై వడ్డీ రేటు సవరణకు సంబంధించిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు. ªూహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తన తప్పులను గుర్తించిన మోదీ, లోక్ కల్యాణ్ మార్గ్ పేరును జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఆయన మోదీ మహల్‌ను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మితమవుతున్న పార్లమెంటు, తదితర పరిపాలనా భవనాలతో కూడిన సెంట్రల్ విస్టా అవెన్యూను పరోక్షంగా మోదీ మహల్ అని పేర్కొన్నారు. రాహుల్ ఇచ్చిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మార్చిలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. 2021`22 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. ఇంత తక్కువ వడ్డీ రేటు ఉండటం 40 ఏళ్ళలో ఇదే మొదటిసారి. 1977`78లో ఈ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్డును 2016లో లోక్ కల్యాణ్ మార్గ్‌గా మార్చారు.
3.జుబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుల అరెస్టు
` పోలీసులు స్వతంత్య్రంగా వ్యవహరిస్తున్నారు
` హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్,జూన్ 4(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ అత్యాచారకేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో దోషులను వదిలిపెట్టమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ లీ స్పష్టం చేశారు. ఈఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇటు పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు. తెలంగాణ పోలీసులపై ఏ ప్రజాప్రతినిధి ఒత్తిడి లేదన్నారు. ఇదిలావుంటే ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘనటపై సిబిఐ విచారణకు కాంగ్రెస్, బిజెపిలుఎ డిమాండ్ చేశాయి. ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ డిజిపి కార్యలయ ముట్టడికి ప్రయత్నించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన శుక్రవారం ఒకరిని అదుపులోకి తీసుకోగా.. శనివారం ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్షాలు ధర్నాలు చేశాయి. పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్‌ఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడిరచారు. ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా.. భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి.. తండ్రి ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక షాక్ నుంచి తేరుకున్నాక.. భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో అనునయంగా మాట్లాడడంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడిరచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ కాంగ్రెస్, భాజపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసు ఠాణా వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ కూడా నిందితుల్లో ఉన్నారంటూ ప్రచారమవగా, తనకు సంబంధం లేదంటూ పుర్ఖాన్ ఖండిరచారు. ఈఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. నిందితులను రక్షించడానికి పోలీస్‌శాఖ కేసును పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. బాలికపై అఘాయిత్యం కేసులో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా.. నిందితులకు అండగా లేమనే అపవాదును తొలగించుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పలుకుబడిన వారి కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్న ఘటనలో పోలీసులు నిష్పాక్షికంగా ఎలా దర్యాప్తు చేయగలరని ప్రశ్నించారు. బాలికపై అత్యాచారం కేసులో సీబీఐతో విచారణ జరిపించకపోతే న్యాయపోరాటం చేసి బాధితులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని పబ్బులను మూసివేయాలని కోరారు. శాంతిభద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. నగరంలో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మర్డర్, రేప్‌లు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదని, వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌ను నిరసిస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిరచేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోత రోహిత్ మాట్లాడుతూ... విూడియాలో వచ్చే వరకు పోలీసులు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నిందితులను శిక్షించాలని హోం మంత్రిని ఆదేశించడం విడ్డూరమని తెలిపారు. నిందితులను గుర్తించి శిక్షించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం అందుకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ స్పందించి అసలైన దోషులను అదుపులోకి తీసుకొని శిక్షించాలన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మోత రోహిత్ స్పష్టం చేశారు.
5.కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి..
` ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హరీశ్‌రావు
హైదరాబాద్,జూన్ 4(జనంసాక్షి): దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహించకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. అమెరికా, ఉత్తర కొరియా, జర్మనీలో నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయని.. మనదేశంలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయని.. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివీటీ రేటు పెద్దగా లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.’’రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ వైద్యారోగ్య శాఖ సిబ్బంది అలసత్వంతో ఉండరాదు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. గుంపులు, గుంపులుగా తిరగొద్దు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకొని అవసరమైన ఔషధాలు తీసుకోవాలి. కరోనా పరీక్షలు, చికిత్స, వాక్సినేషన్ పక్కాగా జరిగేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పని చేయాలి. ఇప్పటివరకు కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది చాలా బాగా పని చేశారు. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా అప్రమత్రంగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడుదాం’’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
6.కాశ్మీర్ నుంచి పండిట్‌ల బదిలీకి కేంద్రం ఓకే..
` 177 మంది కశ్మీర్ పండిట్ టీచర్లకు సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్
శ్రీనగర్,జూన్ 4(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో వారు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 177 మంది కశ్మీర్ పండిట్ టీచర్లకు సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. మే 12న సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో రాహుల్ భట్ మరణించాడు. ఈ సంఘటన నాటి నుంచి కశ్మీరీ పండిట్ల నిరసనలు తీవ్రమయ్యాయి. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లేని పక్షంలో మూకుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని, సెలవులు పెడతామని హెచ్చరిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీరీ పండిట్ల భద్రతకు సంబంధించిన డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో 2012లో ప్రధాన మంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద ఉద్యోగంలో చేరిన 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేశారు.కాగా, మే 1 నుంచి పౌరులు, వలస వ్యక్తుల లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడుల సంఖ్య 9కి పెరిగింది. గురువారం జమ్ముకశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక బ్యాంక్ మేనేజర్, ఇద్దరు వలస కూలీలు మరణించారు. దీనికి ముందు జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాకు చెందిన ఓ మహిళా టీచర్‌ను మంగళవారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు కాల్చి చంపారు.మే 18న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వద్ద ఉన్న వైన్‌షాప్‌లోకి ఉగ్రవాదులు చొరబడి గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మే 24న శ్రీనగర్‌లో నివాసం వెలుపల పోలీస్ అయిన సైఫుల్లా ఖాద్రీని, అనంతరం రెండు రోజులకు టెలివిజన్ ఆర్టిస్ట్ అవ్రిూన్ భట్‌ను బుద్గామ్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు.
7.కోర్టు తీర్పులను ప్రభుత్వమే అమలు చేయకపోతే ఎలా!
` ‘సీఎం జగన్ తప్పు సరిదిద్దుకొనేందుకు అదో మంచి ఛాన్స్!’
` అమరావతిపై ఏపీ సర్కార్ తీరు బాగోలేదన్న మేధావులు
విజయవాడ,జూన్ 4(జనంసాక్షి): అమరావతిపై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు.అమరావతి రాజధాని రైతులు కొనసాగిస్తున్న పోరు 900వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో వారి పోరాటానికి మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ‘అమరావతిపై హైకోర్టు తీర్పు` సర్కారు తీరు’ అనే అంశంపై చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరావతి నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పక్కనబెట్టిందంటూ నేతలు ధ్వజమెత్తారు. అవసరమైతే మరో ఉద్యమం చేపట్టయినా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, కమలానంద భారతి, జస్టిస్ గోపాల గౌడ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, మూడు రాజధానుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆ తీర్పు ప్రభుత్వం, సీఎం తప్పు సరిద్దుకొనే ఛాన్స్ ఇచ్చింది!
అమరావతి నిర్మాణాన్ని కొనసాగించేలా తీర్పు ఇచ్చిన హైకోర్టు ప్రభుత్వం, సీఎం జగన్‌కు తమ తప్పును సరిదిద్దుకొనే అవకాశం ఇచ్చిందని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. కేంద్రం అండ పుష్కలంగా ఉన్న సీఎం జగన్ రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ప్రజలకు మేలు చేయాలని హితవుపలికారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. ‘’యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కలిగిందని గతంలో రాజధాని ప్రాంత రైతులు ఎంతో సంతోషపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో అనుకూలం. కేంద్రం ఏపీ సీఎంను పెద్ద కొడుకులా చూస్తోంది. రాజధాని లేకుండా రాష్ట్రం ఇవ్వొచ్చని గత కేంద్ర ప్రభుత్వం రుజువు చేస్తే.. అసలు రాజధాని లేకుండా పాలన సాగించొచ్చనేలా ఇక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏపీకి రాజధాని లేకుండా బిల్లును ఒప్పుకోవడం.. భాజపా చేసిన తప్పు. పార్లమెంటులో నిర్ణయం చేయడం కాంగ్రెస్ చేసిన తప్పు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేసినా రూపం మార్చుకొని అదే రాష్ట్రాన్ని పాలిస్తోంది’’ అని విమర్శించారు.’’గతంలో ఆంధ్రాను 66వంశాల వారు పరిపాలించారు. రాజధానిని ఒక్కటిగా కలిపి ఉంచలేకపోతే మూడు ముక్కలు కాదు.. 36 ముక్కలవుతుంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానినీ నిర్మించే బాధ్యత కేంద్రానిదే అంటే భాజపాదే. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య విభేదాలు వస్తే ఆ బాధ్యత వైఎస్ కుటుంబానిదేనని గుర్తుంచుకోవాలి. గ్రామదేవతల దీవెనలు, మృత్తిక, శాస్త్రోక్తంగా ఇటుక పెట్టిన ప్రాంతంగా రాజధాని ఎక్కడికీ పోదు. ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలాపురం వంటి ఘటనలు ఇతర సమస్యల నుంచి బయట పడాలి. రాజధానిలో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకున్నారు.. ఇది మంచిది కాదు’’ అని హెచ్చరించారు.
ప్రభుత్వం ఏ ధైర్యంతో ముందుకెళ్తోంది?: గోపాల గౌడ, సుప్రీం కోర్టు విశ్రాంత జడ్జి
’’నా మాతృమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చారు. అందుకే ఏపీ నా మాతృ భూమి. అమరావతికి నేను ఇప్పటివరకు నాలుగుసార్లు వచ్చాను. రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు చట్టబద్ధం, రాజ్యాంగ బద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా తీర్పు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని రైతులకు విశ్వాసం కల్పించి.. ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? న్యాయస్థానం చెప్పినా దాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ఏ ధైర్యంతో ముందుకు వెళ్తోంది? రాజ్యాంగ బద్ధమైన అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కనబర్చేలా పనిచేయాలి. ప్రజల ఆకాంక్షలను పరిగణనలో తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? మూడు నెలలు గడుస్తున్నా కోర్టు తీర్పును అమలు చేయకపోతే అది కచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుంది. చట్టబద్ధమైన విధులు ఉన్నప్పటికీ అటు ప్రభుత్వం.. ఇటు, కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) రెండూ వాటి విధులను ఉల్లంఘిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కరోనా వస్తే క్రోసిన్ టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పడం కాదు.. ఆస్పత్రులు కట్టడం.. ఆక్సిజన్ అందించడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పాలనా వికేంద్రీకరణ అంటే విశాఖకో కర్నూలుకో వెళ్లడం కాదు.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. రాజధాని కేసుల్లో చట్టం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా బాధ్యులుగా చేసి పార్టీలుగా చేర్చాలి’’ అని అన్నారు.
కోర్టు తీర్పు విూరే అమలుచేయకపోతే ఇక ప్రజలెలా విశ్వసిస్తారు?: హరగోపాల్
కోర్టులు ఇచ్చే తీర్పులను ప్రభుత్వాలే అమలు చేయకపోతే ఇక ప్రజలు ఎలా విశ్వసిస్తారని ఆచార్య హరగోపాల్ ప్రశ్నించారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘’హైకోర్టు తీర్పు అనేక అంశాల్ని బేరీజు వేసిన తర్వాత తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం అమరావతి నిర్మాణ సమయంలో వచ్చా. ఇప్పటికీ ఒక్క భవనం కూడా పూర్తి కాకపోవడం శోచనీయం. పార్టీ అధికారం నుంచి మారితే ప్రభుత్వ నిర్ణయాలు ఎలా మారిపోతాయి? గత ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విచారణ చేయాలి.. ప్రభుత్వం మరో తప్పు ఎలా చేస్తుంది. ప్రభుత్వమే కోర్టు తీర్పు అమలు చేయకపోతే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేయకూడదు. రైతుల నుంచి భూములు తీసుకుని వాళ్ళను ఎలా మోసం చేస్తారు? చరిత్రలో మంచి నిర్ణయం తీసుకున్న పాలకుడిగా సీఎం జగన్ వ్యవహరించాలి. చారిత్రక స్పృహతో ఆలోచించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మర్చేస్తామనడం సరైంది కాదు. ఏదైనా దీర్ఘకాలిక విధానాలు, నిర్ణయాలు ఉండాలి. రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యయుతంగా మూడు రాజధానుల నిర్ణయం తప్పు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం. పారిశ్రామికంగా, ఆర్థిక అభివృద్ధికి అది కావాలి. రాజధాని నిర్మాణం వ్యక్తిగత నిర్ణయం కాదు.. ప్రభుత్వ నిర్ణయంగా ఉండాలి’’ అని సూచించారు.
రాజధానిని ఎలా ముక్కలు చేస్తారు?: కోదండరాం
’’ప్రజల జీవించే హక్కు, నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే హక్కును నిరాకరించడం ప్రభుత్వం చేయలేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే తప్ప గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే అధికారం లేదని ప్రస్తుత ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. మూడు రాజధానులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.15వేల కోట్లు వ్యయం చేసిన రాజధానిని ఎలా ముక్కలు చేస్తారు? వికేంద్రీకరణ చేయదలచుకుంటే అందుకనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు గానీ.. రాజధానిని ఎలా విడగొడతారు? ప్రాంతాల అభివృద్ధికి ఎవరూ అడ్డుచెప్పరు.. కానీ, మరో ప్రాంతం ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహారించకూడదు. ఇతర నగరాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. 900 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతుల మనోభావాలను గుర్తించి వారితో చర్చించాలని కోరుతున్నాం’’ అని కోదండరాం అన్నారు.
ఆంధ్రులుగా బయట చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తోంది!
ఈ చారిత్రక ప్రదేశాన్ని రాజధానిగా నిర్ణయించడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో చర్చల తర్వాత నిర్ణయించిందని విశ్రాంత ఐఏఎస్ గోపాలరావు అన్నారు. గుంటూరు` విజయవాడ మధ్య ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా నిర్మించాలని తీర్మానించారని గుర్తు చేశారు. ‘’అమరావతికి ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. తాత్కాలికమని చెప్పినా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ అక్కడి నుంచే పని చేస్తున్నాయి. దాదాపు రూ.10వేల కోట్ల ప్రజాధనం ఖర్చుచేశారు. ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల్ని ఎంపిక చేసింది. ఓ భవనం కట్టి 100 మంది న్యాయవాదులకు, పరిపాలన భవనం కట్టి ఓ వెయ్యి మంది ఉద్యోగులు వెళ్తే దాన్ని అభివృద్ధి అని ఎలా అంటాం? ఇవన్నీ అభివృద్ధికి చోదక శక్తులు కావు. అభివృద్ధి అంటే ఆర్థిక ప్రగతి, విద్య, వైద్యం, తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలు నివాసం ఉండాలి. అభివృద్ధి అంటే ప్రస్తుత ప్రభుత్వానికి అవగాహన లేనట్టుంది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసి గెంటేశారు. ఆంధ్రులుగా బయట చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది.’’రాజధాన్ని సైతం కులానికి అంటగట్టి మాట్లాడటం చాలా శోచనీయం. అసలు రాజధానికి ఎక్కువ భూములు ఇచ్చిందే ఎస్సీ, బీసి మైనారిటీ రైతులు. అలాంటి వారిని ఇబ్బంది పెడతారా? 20 వేల మంది రైతులు ఎకరం లోపు ఉన్న తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇక్కడ రాజధాని లేకుండా చేయడం ప్రభుత్వ తరం కాదు. హైకోర్టు తమ తీర్పులో ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఏమాత్రం చిత్త శుద్ది ఉన్నా ప్రభుత్వం రాజీనామా చేయాలి. రైతుల పోరాటాన్ని గుర్తించి దేశంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకున్నారు గానీ.. సీఎం మాత్రం ఇప్పటివరకు హైకోర్టు తీర్పుపై దృష్టిపెట్టినట్టులేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని మార్చే ఎలాంటి శాసన అధికారమూ లేదని హైకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్న కారణంగా ప్రభుత్వంపై ధిక్కరణ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా’’ అన్నారు.
ఏపీ సర్కార్‌కు కోర్టులంటే గౌరవంలేదు: యు.మురళీధర్
మూడు రాజధానుల బిల్లులు, అక్రమంగా చేసిన చట్టాలను హైకోర్టులో సవాల్ చేశాం. దక్షిణాఫ్రికాకు ఉన్న మూడు రాజధానుల థియరీకి అనుగుణంగా ఇక్కడ ప్రవేశపెట్టారు. అక్కడి మేధావులను కూడా దీనిపై మేం సంప్రదించాం. ఆ దేశంలో మూడు రాజధానుల ప్రయోగం విఫలమైనట్టు తేలింది. ఆ వివరాలనూ కోర్టుకు సమర్పించాం. కోర్టు బెంచ్‌లపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తూనే ఉంది. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి ఇక్కడి రైతుల పట్ల ద్వేషం ఉందని కోర్టుకు తెలియజేసేలా వాదనలు వినిపించాం. ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కోర్టు ధిక్కారాన్ని తప్పించుకొనేందుకు ప్రభుత్వం చేసిన మరో ప్రయత్నం ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు.. రైతులంటే గౌరవం లేదు .. చట్టమంటే గౌరవం లేదు.. రాజధానిలో పనులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అవగతమవుతోంది. ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. దీనికి అంతా కట్టుబడి ఉండాల్సిందే. కోర్టు ధిక్కార కేసుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు కూడా కోర్టు ముందు నిలబడుతున్నారు’’ అని సీనియర్ న్యాయవాది యు.మురళీధర్ తెలిపారు.
8.బూస్టర్ డోసుగా కార్బెవాక్స్..
` కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికీ కూడా..
` అనుమతించిన డిసిజిఎ
దిల్లీ,జూన్ 4(జనంసాక్షి): హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్`ఇ రూపొందించిన కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళుపైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.అయితే గతంలో కొవిషీల్డ్ కానీ, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ.. ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్ ఘనత సాధించింది.డీసీజీఐ నిర్ణయంపై బయోలాజికల్`ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆమోదం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. దేశంలోని బూస్టర్ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించింది’ అని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్ ప్రికాషనరీ డోసు పొందవచ్చు.కార్బెవాక్స్ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 10కోట్ల డోసులను బయోలాజికల్`ఇ సరఫరా చేసింది. మరోవైపు తేలికగా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృథా అరికట్టేందుకుగానూ ఒక్క డోసును ఒకే వయల్ (బాటిల్)లో అందుబాటులో తీసుకువచ్చింది. కొద్దిరోజుల క్రితమే టీకా ధరను సంస్థ భారీగా తగ్గించింది. గతంలో డోసుకు రూ.840గా ఉండగా దీన్ని రూ.250 (పన్నులతో కలిపి)కి తగ్గించినట్లు గత నెలలో ప్రకటించింది.
9.పీపీఈ కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం అక్రమాలు
` దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణ
` గుజరాత్‌లో అన్ని స్థానాల నుంచి పోటీచేస్తామని ప్రకటన
దిల్లీ,జూన్ 4(జనంసాక్షి):భాజపాకు చెందిన ఓ బడా నేత అవినీతిని బయటపెడతామని శనివారం దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.దానిలో భాగంగానే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పుడు విూడియా వేదికగా ఆ బడా నేత అవినీతిపై వివరాలు వెల్లడిరచారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ అని, కొవిడ్ రక్షణ కవచంగా వాడుతోన్న పీపీఈ కిట్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.అస్సాం ముఖ్యమంత్రి పీపీఈ కిట్ల కాంట్రాక్టును తన కుటుంబానికి చెందిన సంస్థకు కట్టబెట్టారని, అందుకోసం భారీగా చెల్లించారని సిసోడియా తెలిపారు. ‘హిమంత తన భార్యకు చెందిన సంస్థకు పీపీఈ కిట్ల కాంట్రాక్టును అప్పగించారు. రూ.990 చెల్లించి పీపీఈ కిట్లు కొనుగోలు చేశారు. అదేరోజు ఇతరులు వేరే సంస్థ నుంచి కొనుగోలు చేసినందుకు రూ.600 చెల్లించారు. దానిని నిరూపించేందుకు నా దగ్గర పత్రాలు ఉన్నాయి. తన పార్టీ నేతపై చర్యలు తీసుకునే ధైర్యం భాజపాకు ఉందా..? లేక మాపై కేసులు పెట్టి వెంటాడుతుందా..?’ అని పేర్కొన్నారు. ఈ అవకతవకల గురించి రెండు రోజుల క్రితం ఓ వార్తా సంస్థ పరిశోధనాత్మక కథనం రాసింది. దాని ఆధారంగానే ఆప్ ప్రభుత్వం నుంచి విమర్శలు వచ్చాయి. అయితే హిమంత భార్య ఈ వార్తలను తీవ్రంగా ఖండిరచారు.మనీ లాండరింగ్ కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు.. ఆప్, కేంద్రం మధ్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ అరెస్టు విషయంలో కేజ్రీవాల్ తాజాగా మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘జైన్ నిందితుడు కాదు. ఆయన్ను ప్రశ్నిస్తున్నాం: ఈడీ’ అని శీర్షికతో ఉన్న ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ.. ‘జైన్ నిందితుడు కాదని కేంద్ర ప్రభుత్వమే కోర్టులో తెలిపింది. అసలు నిందితుడే కానప్పుడు.. ఆయన అవినీతిపరుడు ఎలా అవుతారు?’ అంటూ ట్వీట్ చేశారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నేడు భాజపాకు చెందిన ఓ బడా నేత చిట్టా విప్పనున్నట్లు తెలిపారు. నిజమైన అవినీతి ఎలా ఉంటుంది? పెద్ద అవినీతిపరుడు ఎలా కనిపిస్తారు? అనే విషయాన్ని ఆయన బహిర్గతం చేస్తారని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే సిసోడియా విూడియా ముందు వివరాలు వెల్లడిరచారు.
గుజరాత్‌లో అన్ని స్థానాల నుంచి పోటీ
గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి బరిలో దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించింది.గుజరాత్‌లో ఉన్న మొత్తం 182 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా వెల్లడిరచారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని.. ఇప్పుడు ‘ఆప్’ వస్తోందని పేర్కొన్నారు. సిసోడియా వడోదరాలో మాట్లాడుతూ.. ‘గుజరాత్‌లోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తాం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఓ ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. కానీ, ఆప్ వస్తోంది. ఎవరికి ఓటు వేయాలో ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు.పంజాబ్‌లో ఘన విజయంతో ఊపువిూదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మరికొద్ది నెలల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం హిమాచల్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ తమ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆప్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని అవినీతిని రూపుమాపుతామని వెల్లడిరచారు. ఈ నెల 6వ తేదీన మెప్‌ాసనాలో నిర్వహించే ‘త్రివర్ణ పతాక యాత్ర’లో కేజ్రీవాల్ పాల్గొననున్నారు.
10.దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
` కొత్తగా 3,962 కేసులు నమోదు
` మహరాష్ట్రలోనే అధికంగగా కేసుల సంఖ్య
న్యూఢల్లీి,జూన్ 4(జనంసాక్షి): భారత్‌లో కరోనా వైరస్ మరోసారి తన ఉనికిని చాటుతోంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో పెరుగుదల ఊగిసలాట కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగు తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. శనివారం కేంద్రం విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,962 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 26 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచే అధికంగా కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో.. అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అదనపు సీఎస్ డాక్టర్ ప్రదీప్ వ్యాస్.. జిల్లా అధికారులకు ఉత్తర్వులు పంపించారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్‌గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే బహిరంగ ప్రాంతాల్లో మాత్రం మాస్క్ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మాస్క్ స్వచ్ఛందంగా ధరించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా... 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా ఉదృతి ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. తాజా కరోనా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా 26 మరణాలతో.. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 11,67,037 మంది వ్యాక్సినేషనల్‌లో పాల్గొన్నారు.
11.దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలి
` కేంద్రాన్ని డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మహబూబ్‌నగర్,జూన్ 4(జనంసాక్షి):దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.దేశంలోని మెజారిటీ ప్రజలకు ఉపాధి కలిపించే రంగం పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం రైతాంగానికి తెలంగాణ మాదిరిగా సాగునీళ్లు, కరంటు, పెట్టుబడి కింద రైతుబంధు, రైతుభీమా అమలుచేస్తామని,పంటలను కొనుగోళ్లు చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించాలన్నారు.కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లి గ్రామ పరిదిలోని విత్తానాభివృద్ది క్షేత్రంలో రూ. 4.85 కోట్లతో నూతనంగా నిర్మించిన విత్తనశుద్ది కర్మాగారము ,గిడ్డంగుల సముదాయాన్ని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులతో అవగాహన సదస్సులో మాట్లాడుతూ ‘‘ 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, 3 రాష్ట్రాలలో సొంతంగా, 3 రాష్ట్రాలలో పొత్తుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అక్కడ తెలంగాణలో అమలవుతున్న పథకాలను అమలుచేయడం లేదు.కానీ తెలంగాణలో అధికారం ఇస్తే ఇక్కడ అమలుచేస్తారట .. దమ్ముంటే, చేతనైతే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి తెలంగాణ నేల విూదకు వచ్చి మాటలు చెప్పాలి తెలంగాణ రైతాంగం చైతన్యవంతమైంది .. ఇక్కడి రైతులతో చెలగాటం ఆడవద్దుతెలంగాణ రైతులకు భరించడం తెలుసు .. భరితెగించి పోరాడటం తెలుసు .. తుపాకులతో పోరాడిన చరిత్ర ఇక్కడి రైతులదిదేశంలో అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కార్పోరేట్లలో అత్యధికులా గుజరాతీయులువ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌ఈ స్థితికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు కారణంతెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ రైతులు ఎదుర్కొన్న అవమానాలు మామూలువి కావుకిరాణ దుకాణం, సర్కారు కార్యాలయాలు, బ్యాంకులు ఎక్కడికి వెళ్లినా సన్న, చిన్నకారు రైతులే మధ్యతరగతి, భూస్వామ్య రైతులకు కూడా ఈసడిరపులే, ఛీత్కారాలేతెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రైతు అంటే గౌరవమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం రైతులను నిలబెట్టిందితెలంగాణ వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం, ఈ రంగం విూద ఆధారపడి ఉపాధి పొందే జనాభాను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఒక్కొక్క పథకాన్ని తీసుకువచ్చారువేల కోట్లు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసినా వందలు, వేల మందికే ఉపాధి లభిస్తుంది2.40 కోట్ల మందికి ఉపాధినిస్తుందనే వ్యవసాయ రంగం విూద దృష్టి సారించి రైతాంగానికి కేసీఆర్ అండగా నిలిచారుఅమెరికా తర్వాత భారతదేశానికే అత్యధిక సాగుభూమి ఉన్నదిమనకన్నా చైనాకు సాగుభూమి తక్కువగా ఉన్నా అక్కడ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది .. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు అక్కడ రైతాంగం నడుచుకుంటుందిమన దేశంలోని పాలకులకు అత్యధిక శాతం జనాభాకు ఉపాధినిచ్చే వ్యవసాయ రంగం పట్ల ముందుచూపు లేదుఒకప్పుడు 10,12 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఎక్కువ .. నేడు బాన్సువాడ రైతులు అధిక ఉత్పత్తి సాధిస్తున్నారు .. పంటకాలాన్ని కూడా ముందుకు జరుపుకుని సాగు చేస్తున్న బాన్సువాడ రైతులు అభినందనీయులుచైనాలో వరి ఎకరాకు 100 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 150 క్వింటాళ్లు దిగుబడి వస్తుందిమన వద్ద అత్యధికంగా ఎకరాకు 32 నుండి 35 క్వింటాళ్లు, మొక్కజొన్న 20,30 క్వింటాళ్లుకేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉత్పాదకతను పెంచే వంగడాలను తీసుకురాలేదుదీనిమూలంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధరలు మన పంటలకు గిట్టుబాటు లేదుదేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్థలు ఇస్తున్న నివేదికలను కేంద్రం పట్టించుకోవడం లేదుభూసార పరీక్షలను ఏటా నిర్వహిస్తే ఆ భూములకు ఎలాంటి మందులు, ఎరువులు వాడాలో తెలుస్తుందిపచ్చిరొట్ట ఎరువులు, గొర్రెలు, పశువులు, కోళ్ల ఎరువులను రైతులు విరివిగా ఉపయోగించాలిముఖ్యంగా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి .. తెలంగాణ రైతులకు ఈ దిశగా శిక్షణ కల్పిస్తాంప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించి రైతులు దేశానికి అదర్శంగా నిలవాలి’’ అన్నారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ‘‘ చెప్పడం మా వంతు, అమలు చేయడం విూ వంతు..బాన్సువాడ నియేజకవర్గం ప్రదానంగా వరి పండిరచే ప్రాంతం.రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆలోచన చేయాలి.రాష్ట్ర అవసరాలు 30 లక్షల మెట్రిక్ టన్నులు అయితే రాష్ట్రంలో ఏడాదికి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది.కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే దయకలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నా సరిjైున ఆధాయం లేదు. దీనికితోడు కోతులు, అడవి పందులు, పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయు. వీటినన్నింటిని తట్టుకుని మంచి లాభాలు ఇచ్చేవి ఆయిల్ ఫాం పంట.2018 లో ప్రయోగాత్మకంగా బొప్పస్‌పల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫాం మొక్కలను నాటించాం.. నాలుగు సంవత్సరాల చెట్లు ఆయిల్ ఫాం గెలలు వచ్చాయి.అంతర పంటలను పండిరచుకోవచ్చు.ఒక్కసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.మన దేశం ఏటా లక్ష కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నది.తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు ఆయిల్ ఫాం సాగుకు అనుకూలం.రూ . 300 ల మొక్క ను ప్రభుత్వ సభ్సిడి తో రూ. 20 కే ఇస్తారు.ఎకరా వరి నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫాం సాగుచేయవచ్చు.కొనుగోలు సమస్య లేదు.ఫ్యాక్టరీ వాళ్ళే కొనుగోలు చేస్తారు.’’ అని తెలిపారు.
12.రసాయన పరిశ్రమలో పేలుడు..
` తొమ్మిది మంది మృతి
హాపూర్,జూన్ 4(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా..దాదాపు 15మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైరింజన్లు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దిల్లీకి దాదాపు 80కి.విూల దూరంలోని ధౌలానాలోని యూపీఎస్‌ఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు సైతం దెబ్బతిన్నట్టు పోలీసులు తెలిప